Facebook: రూ.32 కోట్లు తినేసిన ఉద్యోగి

Facebook: కంపెనీ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పిన‌ప్పుడు కొంద‌రు క‌క్కుర్తి ప‌డి కంపెనీనే ముంచేద్దామ‌ని చూస్తుంటారు అన‌డానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. ఉన్నత ప‌ద‌విలో ఉండి కంపెనీకి తెలీకుండా ఓ యువ‌తి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.32 కోట్లు తినేసింది. ఈ ఘ‌ట‌న కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. బార్బారా అనే యువ‌తి ఫేస్‌బుక్‌లో గ్లోబ‌ల్ హెడ్‌గా ప‌నిచేసేది. ఈ నేప‌థ్యంలో ఆమె త‌న కార్పొరేట్ క్రెడిట్ కార్డుల‌ను కంపెనీకి సంబంధించిన ఎక్స్‌పెన్స్ అకౌంట్ సిస్ట‌మ్‌కు లింక్ చేయించుకుంది.

అలా త‌ను కొనుగోలు చేసే ప్ర‌తి వ‌స్తువుకు కంపెనీ నిధుల నుంచే డ‌బ్బు డెబిట్ అయ్యేలా సెట్ చేసుకుంది. 2017 నుంచి ఇలా కంపెనీ నిధుల‌ను వాడుకుంటూ వచ్చిన బార్బ‌రా ఎవ్వ‌రికీ అనుమానం రాకుండా 2021 వ‌ర‌కు ఇలా చేసింది. ఆ త‌ర్వాత కంపెనీకి ఈ విష‌యం తెలిసి వారు కూడా షాక‌య్యారు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా బార్బ‌రా త‌న మోసాన్ని ఒప్పుకుంది. బార్బ‌రాకు ప‌డిన శిక్ష 2024 మార్చి నుంచి అమ‌ల‌వుతుంది. అప్ప‌టివ‌ర‌కు ఆమెను 5000 డాల‌ర్ల బాండ్‌పై రిలీజ్ చేసారు.