Hardeep Singh Nijjar కథేంటి.. ఎవరితను..?
భారత్, కెనడా మధ్య చిచ్చుపెట్టి.. ఇరు దేశాలకు అవసరమైన డీల్స్ కుదరకుండా చేసాడు హర్దీప్ సింగ్ నిజ్జర్ (hardeep singh nijjar). ఇతను చనిపోయినప్పటికీ ఏదో ఒక సమస్య సృష్టిస్తూనే ఉన్నాడు. అసలు ఇతను ఎవరు? ఎందుకు ఇతని వల్ల మనదేశం కెనడాతో గొడవపడుతోంది?
నిజ్జర్ ఫేక్ పాస్‌పోర్ట్‌పై 1977లో కెనడాకు వెళ్లాడు. దాంతో ఆ దేశం అతన్ని ఉండేందుకు అనుమతి నిరాకరించింది. దాంతో నిజ్జర్ కెనడా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇమ్మిగ్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కెనడా ప్రభుత్వం దానికి కూడా ఒప్పుకోలేదు. ఆ తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్‌ని కెనడియన్‌గానే సంబోధించారు. 2020లో భారత్ నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. బ్యాన్ చేయబడిన ఉగ్రవాద సంస్థ KTF కోసం యువకులను ఎంపికచేసుకుని ఉగ్రవాదులుగా మారుస్తున్నాడని ఆరోపించింది.
నిజ్జర్ భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడని ఎన్నో ఏళ్ల నుంచి భారత్ మొత్తుకుంటూనే ఉంది. 2018లో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. వాంటెడ్ టెర్రరిస్ట్‌ల లిస్ట్‌ను కెనడాకు పంపించారు. ఆ లిస్ట్‌లో నిజ్జర్ పేరు కూడా ఉంది. ఆ తర్వాత 2022లో నిజ్జర్‌ను వెంటనే కెనడా నుంచి భారత్‌లోని పంజాబ్ పోలీసులకు అప్పగించాలని .. అతను ఇండియాలో ఎన్నో ఉగ్రవాద నేరాలకు పాల్పడ్డాడని కూడా తెలిపారు. పంజాబ్‌లోని లుధియానాలో 2007లో నిజ్జర్ పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా దాదాపు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. (hardeep singh nijjar)
2010లో పటియాలాలోని ఓ ఆలయంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో నిజ్జర్ పాత్ర ఉన్నట్లు తెలిసి పంజాబ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు. కెనడాలో ఉంటున్న పరమ్‌జీత్ సింగ్ అనే మరో ఉగ్రవాది కూడా ఈ దాడిలో అనుమానితుడే. ఇలా 2015, 2016లో హిందువులను టార్గెట్ చేసి చంపుతున్నారని కూడా వారిపై కేసులు నమోదయ్యాయి. దాంతో అతనిపై భారత్ లుకౌట్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. 2018లో పంజాబ్‌కు చెందిన RSS నేతలను హర్ష్‌దీప్ సింగ్ చంపాడన్న అనుమానాలు ఉన్నాయని ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పంజాబ్ నేషనల్ ఇన్‌వెస్టిగేటివ్ ఏజెన్సీ (NIA) వెల్లడించింది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన పూజారిని చంపేసాడన్న కారణంగా 2022లో నిజ్జర్‌ని పట్టిస్తే NIA రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అలా 2022 జూన్‌లో నిజ్జర్ ఆలయంలో జరిపిన దాడిలో చనిపోయాడు.
కనడా ప్రావిన్స్ అయిన బ్రిటిష్ కొలంబియాలో సుర్రే ప్రాంతంలో ఉన్న గురుద్వార వద్ద నిజ్జర్ ఉన్నాడని తెలీడంతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. దాంతో నిజ్జర్ అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే నిజ్జర్‌పై ఎటాక్ చేసిన వారిలో భారత రాయబారి కూడా ఉన్నాడని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయబారిని విధుల నుంచి తొలగించి ఐదు రోజుల్లో ఇండియాకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసారు. ట్రూడో ఆరోపణలపై భారత ప్రభుత్వం మండిపడింది. (hardeep singh nijjar)