Tata Steel: మూత‌బ‌డిన వందేళ్ల‌ టాటా స్టీల్ ప‌రిశ్ర‌మ‌

end of an era for Tata Steel

Tata Steel: టాటా స్టీల్ వందేళ్ల శ‌కం ముగిసింది. వందేళ్ల పాటు ప‌నిచేసిన టాటా స్టీల్ త‌యారీ సంస్థ‌ను టాటా కంపెనీ మూసేసింది. టాటా సంస్థ‌కు భార‌త్‌లోనే కాకుండా విదేశాల్లో చాలా ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. యూకేలో టాటా స్టీల్ అతిపెద్ద సంస్థ‌. సౌత్ వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్ వ‌ద్ద ఈ స్టీల్ త‌యారీ సంస్థ ఉంది. దాదాపు వందేళ్లుగా ఈ ప‌రిశ్ర‌మ ప‌నిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో పోర్ట్ టాల్బోట్ వ‌ద్ద ఉన్న బ్లాస్ట్ ఫ‌ర్నేస్‌ను మూసేసారు. దాంతో సంప్ర‌దాయంగా స్టీల్ సామాగ్రిని త‌యారుచేసే విధానానికి ఫుల్‌స్టాప్ ప‌డింది. ఈ నేప‌థ్యంలో ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన విధానాల‌ను అమ‌లు ప‌ర‌చ‌నున్న‌ట్లు టాటా సంస్థ ప్ర‌క‌టించింది.

అయితే ఈ ప‌రిశ్ర‌మ‌ను మూసివేసిన‌ప్ప‌టికీ అక్క‌డ ప‌నిచేస్తున్న 5000 మందిని మాత్రం ఉద్యోగాల నుంచి తీసేయ‌లేదు. ఇదే పోర్ట్ టాల్బోట్ 2027 నుంచి 2028 మ‌ధ్య‌లో కొత్త ఎల‌క్ట్రిక్ ఆర్క్ ఫ‌ర్నేస్ ఫెసిటిలీ సెంట‌ర్‌ను ప్రారంభించ‌నున్నారు. అప్ప‌టివ‌ర‌కు ఈ 5000 మంది వేరే టాటా సంస్థ‌లో ప‌నిచేస్తారు. ఈ ఫెసిటిలీ సెంట‌ర్‌కు అయ్యే ఖ‌ర్చు రూ. 1.25 బిలియ‌న్. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం స‌హ‌కారం కూడా ఉంది. ఈ ఎల‌క్ట్రిక్ ఫ‌ర్నేస్ ఫెసిలిటీ కోసం యూకే నుంచి స్క్రాప్ స్టీల్ సామాగ్రిని తెప్పించ‌నున్నారు. త్వ‌ర‌లో ఏ కంపెనీ దీనిని నిర్మించ‌నుందో దానికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డిస్తారు. అయితే ఈ కొత్త ఫెసిలిటీ సెంట‌ర్ వ‌ల్ల 2500 మంది ఉద్యోగాలు రిస్క్‌లో ప‌డే అవ‌కాశం ఉంద‌ని యూకేకి చెందిన టాటా స్టీల్ సీఈఓ రాజేష్ నాయ‌ర్ వెల్ల‌డించారు.