Elon Musk: ఉద్యోగుల్ని తీసేయండి.. అప్పుడే ప్రొడక్టివిటీ!
Hyderabad: ఎంత ఎక్కువ మంది ఉద్యోగులను తొలగిస్తే కంపెనీలకు అంత ప్రొడక్టివిటీ అని అంటున్నారు ట్విటర్ (twitter) సీఈఓ ఎలాన్ మస్క్ elon musk). గతేడాది ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ 7500 ఉద్యోగులు ఉన్న కంపెనీని 1500కి తెచ్చారు. అందులో చాలా మంది వర్క్ ఫ్రం హోం (work from home) చేస్తున్నారని, అది నైతకంగా కరెక్ట్ పద్ధతి కాదని తెలిపారు. ట్విటర్ నుంచి చాలా మందిని మస్క్ తొలగిస్తే.. ఇంకొందరు అతని పనితీరు, ప్రవర్తన నచ్చక వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మస్క్ తన కంపెనీలోని ఉద్యోగులను తీసేయడమే కాకుండా ఇతర కంపెనీలు కూడా ఈ విధానాన్ని ఫాలో అవ్వాలని అంటున్నారు. అనవసరంగా హైర్ చేసుకున్న వారిని వెంటనే తొలగించేస్తే కంపెనీ ప్రొడక్టివిటీ మరింత పెరుగుతుందని తెలిపారు. ట్విటర్‌లో (twitter) ఇప్పుడు తక్కువ మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ.. ప్రొడక్టివిటీ విషయంలో మాత్రం తగ్గలేదని అన్నారు.
ట్విటర్‌ని కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థ సీఈఓగా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్‌ని (parag agarwal) తొలగించేసారు మస్క్. ట్విటర్ (twitter) ప్లాట్‌ఫాంని ఓ ఎన్జీఓని చేసేసారని మండిపడ్డారు. రానున్న 20-30 ఏళ్లలో ఊహకు అందని మార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు. చెప్పాలంటే మరో 30 ఏళ్ల తర్వాత సమాజాన్నే గుర్తుపట్టలేనంతగా మారిపోతుందని తెలిపారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ఉద్యోగులపై చూపే ప్రభావం తొందరలోనే ఉందని, కేవలం మూడేళ్ల దూరంలోనే ఉన్నామని హెచ్చరించారు.