Elon Musk: ఇక భవిష్యత్తులో ఫోన్లే ఉండవు..అందరూ ఇవి వాడాల్సిందే
Elon Musk: ఇక భవిష్యత్తులో ఫోన్లనేవే కనిపించవని అన్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఫోన్ల స్థానంలో న్యూరాలింక్స్ ఉంటాయని అందరూ వాటి ద్వారా ఒకరినొకరు సంప్రదించుకుంటారని తెలిపారు. ఇప్పటికే ఎలాన్ మస్క్ 29 ఏళ్ల నోలాండ్ అనే యువకుడి మెదడు ఓ న్యూరాలింక్ చిప్‌ను అమర్చాడు. నోలాండ్ ఓ ప్రమాదంలో గాయపడటంతో అతని ఎడమ చెయ్యి పక్షవాతానికి గురైంది.
ఈ ఏడాది జనవరి 28న ఎలాన్ మస్క్ అతని మెదడులో న్యూరాలింక్ పెట్టించాడు. అది పెట్టిన వంద రోజుల తర్వాత ఆ వ్యక్తి శరీరంలో జరుగుతున్న మార్పుల గురించి ఎప్పటికప్పుడు మస్క్ ట్విటర్ ద్వారా వెల్లడిస్తూనే ఉన్నాడు. దీనిని బట్టి చూస్తే ఇక భవిష్యత్తులో అసలు ఫోన్లే ఉండవని న్యూరాలింక్సే పనిచేస్తాయని మస్క్ అంటున్నారు. అయితే ఇప్పుడు మస్క్ న్యూరాలింక్ పెట్టడానికి మరో వ్యక్తి కోసం వెతుకుతున్నాడు. దీని ద్వారా కేవలం ఆలోచనలతోనే కంప్యూటర్, మొబైల్ ఫోన్‌ను ఆపరేట్ చేసేయొచ్చు.