Elon Musk: నీకు పిల్ల‌ల్లేరా? న‌న్ను సాయం చేయ‌మంటావా?

elon musk says he will help taylor swift with kids

Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్.. ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ టేల‌ర్ స్విఫ్ట్ ప‌ట్ల అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారు. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్ధి డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రాటిక్ అభ్య‌ర్ధి క‌మ‌లా హ్యారిస్‌లు నిన్న డిబేట్‌లో పాల్గొన్నారు. ఆ డిబేట్ ముగిసిన అనంత‌రం టేల‌ర్ స్విఫ్ట్ త‌న మ‌ద్ద‌తు క‌మ‌లా హారిస్‌కే అని వెల్ల‌డిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అదే పోస్ట్‌లో ఓ పిల్లిని ఎత్తుకున్న ఫోటోను పోస్ట్ చేసారు.

ఈ ఎన్నిక‌ల్లో చైల్డ్‌లెస్ క్యాట్ లేడీ అనే పదం బాగా మారుమోగిపోతోంది. ఎందుకంటే ట్రంప్ క‌మ‌లా హారిస్‌ని ప‌ట్టుకుని చైల్డ్‌లెస్ క్యాట్ లేడీ అని వ్యాఖ్యానించారు. ఎవ‌రైతే పిల్ల‌లు వ‌ద్దు పిల్లులే ముద్దు అనుకుంటారో వారిని చైల్డ్‌లెస్ క్యాట్ లేడీ అంటారు. ఈ నేప‌థ్యంలో టేల‌ర్ స్విఫ్ట్ హారిస్‌కు మ‌ద్ద‌తుగా పిల్లి ఫోటోను పోస్ట్ చేస్తూ తాను కూడా చైల్డ్‌లెస్ క్యాట్ లేడీనే అని ప్ర‌క‌టించింది. దీనిపై ఎలాన్ మ‌స్క్ స్పందించారు. “” ఫ‌ర్వాలేదు టేల‌ర్. నీకు పిల్ల‌లు లేరు అంటున్నావ్. ఆ విష‌యంలో న‌న్ను సాయం చేయ‌మంటావా? నీకు ఓ బిడ్డ‌ను ఇస్తాను. అంతేకాదు నా జీవితం అంతా నీ పిల్లుల‌ను కూడా చూసుకుంటాను “” అని వెట‌కారంగా ట్వీట్ చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది.

ఈ ఎన్నిక‌ల్లో మ‌స్క్ మ‌ద్ద‌తు ట్రంప్‌కే ఉంది. ట్రంప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు పెద్ద మొత్తంలో మ‌స్క్ ఫండ్స్ ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. అంతేకాదు.. ట్రంప్ ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే త‌న క్యాబినెట్‌లో మ‌స్క్‌కి స‌ల‌హాదారు ప‌ద‌విని ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.