Elon Musk: ఉద్యోగినితో మస్క్ శృంగారం.. పిల్లల్ని కనాలని బలవంతం
Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై షాకింగ్ ఆరోపణలు బయటికి వచ్చాయి. స్పేస్ ఎక్స్‌లో ఇంటర్న్‌గా పనిచేస్తున్న యువతితో మస్క్ అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో శృంగారం చేసాడని.. ఒకవేళ గర్భం దాలిస్తే బిడ్డను తనతోనే ఉంచుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడని బాధిత యువతి మీడియా ముందుకు వచ్చి చెప్పడం సంచలనంగా మారింది.
స్పేస్ ఎక్స్‌కి చెందిన ఓ ఎయిర్ హోస్టెస్.. 2016లో మస్క్ తన ముందుకు దుస్తులు లేకుండా వచ్చాడని.. లైంగిక చర్య కోసం ఓ గుర్రాన్ని కానుకగా ఇస్తానని చెప్పాడని ఆరోపించింది. 2013లో స్పేస్ ఎక్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగి.. తనతో మస్క్ పడుకున్నాడని.. బిడ్డ పుడితే తన వద్దే ఉంచుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడని వెల్లడించింది. మరో యువతి తాను 2014లో ఒక నెల రోజుల పాటు మస్క్‌తో రిలేషన్షిప్లో ఉన్నానని.. బ్రేకప్ అవడంతో తన చేత సంతకాలు చేయించుకుని రిజైన్ చేయించారని తెలిపింది.
ఈ ఆరోపణలపై మస్క్ ఇంకా స్పందించలేదు కానీ స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రెసిడెంట్ గ్వైన్ షాట్వెల్ స్పందిస్తూ అవన్నీ అబద్ధాలని తెలిపారు. కంపెనీలో బాగా పనిచేసిన వారిని మస్క్ అభినందిస్తారని.. కానీ ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థంకావడంలేదని అన్నారు.