Elon Musk: పేరు మార్చుకున్న అప‌ర కుబేరుడు..!

అప‌ర కుబేరుడైన ఎలాన్ మ‌స్క్ (elon musk) ఏం చేసినా కూడా సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ అయిపోతోంది. ఇప్ప‌టికే ట్విట‌ర్ పేరు మార్చేసి.. కొత్త రూల్స్ ప్ర‌వేశ‌పెట్టి ఒక ఆట ఆడుకుంటున్న మ‌స్క్.. ఇప్పుడు ఏకంగా త‌న పేరే మార్చేసుకున్నాడు. ఇంత‌కీ మ‌స్క్ కొత్త పేరేంటో తెలుసా? నోబ‌డీ (nobody). అంటే ఎవ‌రూ కాదు అని అర్థం. ఈ విష‌యాన్ని మ‌స్క్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఈ ట్వీట్‌కి ఏకంగా 3 ల‌క్ష‌లకు పైగా లైక్స్ వ‌చ్చాయి. అంద‌రూ ట్విట‌ర్‌లో మ‌స్క్ ఎందుకు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు అంటూ డిబేట్ కూడా మొద‌లెట్టేసారు.