Elon Musk: అవును డ్రగ్స్ తీసుకుంటా
Elon Musk: టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ తాను డ్రగ్స్ తీసుకుంటానని ఒప్పుకున్నారు. కొంతకాలం క్రితం ఎలాన్ డ్రగ్స్ తీసుకుంటున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది. దాంతో కంపెనీ ఏమైపోతుందో అని ఉద్యోగులు భయపడుతున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు.
తాను డ్రగ్స్ తీసుకుంటున్న మాట నిజమే అని తాను తీసుకుంటున్న డ్రగ్ పేరు కీటామైన్ అని తెలిపారు. ఇది డిప్రెషన్ నుంచి బయటపడటానికి వాడుతున్నానని వెల్లడించారు. అయితే దీనిని తానంతట తానే తీసుకోవడం లేదని.. వైద్యుల నుంచి ప్రిస్క్రిప్షన్ రాయించుకుని వాడుతున్నానని అన్నారు. కొన్ని కారణాల వల్ల సడెన్ తన బ్రెయిన్‌లో నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయని ఫలితంగా డిప్రెషన్‌కు గరవుతున్నానని పేర్కొన్నారు. అందుకే ఈ డ్రగ్ తీసుకుంటున్నానని దీని వల్ల కంపెనీని చాలా బాగా నడపగలుగుతున్నానని తెలిపారు.
తాను రోజూ 16 గంటల పాటు పనిచేస్తానని.. తనకు తాగుడు, సిగరెట్ అలవాట్లు కూడా లేవని తెలిపారు. కీటామైన్ డ్రగ్‌ను వారంలో ఒకసారి మాత్రమే తీసుకుంటున్నానని వెల్లడించారు. ఈ డ్రగ్ వాడటం వల్ల తన కంపెనీకి కానీ తన కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి కానీ నష్టం కలుగుతుందని తాను అనుకోవడంలేదని కూడా స్పష్టం చేసారు. (Elon Musk)