మియా ఖ‌లీఫా కోసం తాత క‌ర్వా చౌత్

elderly man does karwa chauth for mia khalifa

Karwa Chauth: క‌ర్వా చౌత్ అంటే భార్య‌లు త‌మ భ‌ర్త‌లు నిండు నూరేళ్ల పాటు చ‌ల్లగా ఉండాల‌ని చేసే ఉప‌వాసం. ఆ రోజున వారు ఉప‌వాసం ఉండి రాత్రి జ‌ల్లెడ ద్వారా చంద్రుడిని చూసి ఆ త‌ర్వాత త‌మ భ‌ర్త‌ను చూసి అప్పుడు ఉప‌వాసాన్ని విర‌మిస్తారు. ఈ మ‌ధ్య‌కాలంలో భార్య‌లే కాదు భ‌ర్త‌లు కూడా ఉప‌వాసం చేస్తున్నారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. ఓ తాత ఏకంగా పోర్న్ స్టార్ మియా ఖ‌లీఫా కోసం ఉప‌వాసం చేసాడంటే న‌మ్ముతారా? ఈ ఘ‌ట‌న ఉత్త‌రాదికి చెందిన ఓ రాష్ట్రంలో జ‌రిగింది. ఓ తాత జ‌ల్లెడ‌తో చంద్రుడిని చూసి ఆ త‌ర్వాత త‌న ఇంటి గోడ‌కు ఉన్న మియా ఖ‌లీఫాను చూసి ఆ త‌ర్వాత త‌న ఉప‌వాసాన్ని విర‌మించాడు. పైగా ఏదో ఘ‌న‌కార్యం చేస్తున్న‌ట్లు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. కొంద‌రు ముస‌లోడే కానీ మ‌హానుభావుడు అని కామెంట్స్ పెడుతుండ‌గా.. మ‌రికొంద‌రు ఈ స‌మాజం ఎటు పోతోందో తెలీడంలేదు అని బాధ‌ప‌డుతున్నారు.