Moon: మన భూమికి చిట్టి చంద్రుడు!
Moon: మన భూమి నుంచి చూస్తే ఒకే చంద్రుడు కనిపిస్తాడు. అయితే.. త్వరలో మన భూమికి మినీ చంద్రుడు రాబోతున్నాడు. ఆ సంగతులేంటో తెలుసుకుందాం.
ఆగస్ట్ 7న మన శాస్త్రవేత్తలు 2024 PT5 అనే గ్రహశకలాన్ని (Asteroid) కనుగొన్నారు. దీని పొడవు 10 మీటర్ల మేర ఉంది. సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు ఈ గ్రహశకలాన్ని మన భూమి గురుత్వాకర్ష శక్తి లాక్కుంటుంది. దాంతో ఇది మన భూమికి చిన్న చంద్రుడిలా మారబోతోందట. మనం చంద్రుడిని చూడగలం కానీ ఈ చిట్టి చంద్రుడిని మాత్రం నేరుగా మన కళ్లతో కానీ టెలిస్కోప్‌తో కానీ చూడలేమట. దీనిని చూడాలంటే శాస్త్రవేత్తలకే సాధ్యం అని అంటున్నారు.
ఈ గ్రహశకలంపై అధ్యయనం చేయడం ద్వారా భూమి గురుత్వాకర్షణ శక్తి దగ్గరగా వచ్చే వస్తువులపై (NEOs) ఎలా ప్రభావం చూపుతుందో శాస్త్రవేత్తలకు మరింత అవగాహన వస్తుంది. భవిష్యత్తులో గ్రహశకలాల తాకిడులను అంచనా వేయడంలో మెరుగైన మోడల్స్‌ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.
గతంలోనూ మన భూమికి ఇలాంటి మినీ చంద్రుళ్లు ఏర్పడ్డాడు. 1981లో 2022 NX1 అనే చిట్టి చంద్రుడు (గ్రహశకలం) 2022 వరకు కనిపించింది. 2024 PT5 వంటి మినీ చంద్రుళ్లు గ్రహశకలాల (ఆస్టరాయిడ్) అంశాలు అంతరిక్షాన్ని మరింత అన్వేషించడానికి తోడ్పడతాయి. ఎందుకంటే అవి సమీపంలో సులభంగా చేరుకునే స్థానంలో ఉంటాయి. ఈ గ్రహశకలం సుమారు రెండు నెలల పాటు మినీ మూన్‌గా ఉంటుంది, తరువాత 2024 నవంబర్ 25న తన సాధారణ సూర్యుని చుట్టూ కక్ష్యకు తిరిగి వెళ్తుంది.