ఆకలికి తట్టుకోలేక జీవితఖైదు విధించిన జడ్జ్..!
ఆకలిగా ఉన్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అంటుంటారు (judge). ఎందకంటే ఈ రెండు అంశాలు మనిషి ఆలోచనా శక్తిని చంపేస్తాయి. ఆకలి, కోపం ఉన్నప్పుడు మైండ్ గజిబిజిగా ఉంటుంది. దాంతో మనం తీసుకునే నిర్ణయాలు మనల్నే బాధించేలా ఉంటాయి. ఆకలి, కోపం ఉన్నప్పుడు అవి మన చేత ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో చెప్పేందుకు ఈ కథే నిదర్శనం.
అసలు ఏం జరిగిందంటే.. ఓ న్యాయమూర్తికి ఆకలి ఎక్కువగా ఉన్న సమయంలో ఓ కేసు వాదనకు వచ్చింది. త్వరగా వాదనలు వినేసి తీర్పు ఇచ్చేసి వెళ్లి హాయిగా భోజనం చేయాలని ఆయన అనుకున్నారు. కానీ కేసు వాదనలు మొదలవగానే ఆయనకు ఆకలి ఎక్కువైపోయింది. మరోపక్క వాదనలు పూర్తవడంలేదన్న కోపం కూడా ఉంది. ఆ ఆకలి, కోపం కారణంగా ముద్దాయికి పెరోల్ కూడా దొరక్కుండా జీవితఖైదు విధించేసారు. ఆ తర్వాత వెంటనే భోజనం చేయడానికి వెళ్లారు. భోజనం చేస్తున్న సమయంలో ఆ జడ్జి తన టిక్‌టాక్ ద్వారా ఎంత ఆకలిగా ఉందంటే.. ఓ ముద్దాయికి పెరోల్ లేకుండా జీవితఖైదు విధించేసాను అని స్వయంగా వెల్లడించాడు. దాంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా మంది నెటిజన్లు ఆ న్యాయమూర్తిని తప్పుబడుతున్నారు. అసలు ఆ ముద్దాయికి ఆ శిక్షకు అర్హుడేనా అని ప్రశ్నిస్తున్నారు. ఆకలి, కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పర్యావసనాలకు దారి తీస్తాయో ఈ ఘటనే నిదర్శనం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (judge)