Gadwal: తాగి పోలీసుల బండినే ఎత్తుకెళ్లిపోయాడు..!

drunkard runs away with police vehicle

Gadwal: గద్వాలలో ఫ‌న్నీ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌ద్యం మ‌త్తులో ఓ యువ‌కుడు ఏకంగా పోలీసుల వాహ‌నాన్నే ఎత్తుకెళ్లిపోయాడు. ఎర్రవల్లికి చెందిన‌ ఓ యువకుడు తాగి హల్ చల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని.. ఓ కానిస్టేబుల్ పోలీసు వాహనాన్ని హైవే పక్కన నిలిపి.. ఆ యువకుడిని పక్కకు పంపించారు. ఆ త‌ర్వాత వారు ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో నిమగ్నమయ్యాడు. ప‌ని పూర్తి చేసుకుని పోలీసులు వాహ‌నం ద‌గ్గ‌రికి వ‌చ్చి చూసేస‌రికి పెట్రోలింగ్ వాహనం అపహరణకు గురైంది. అయితే మద్యం మత్తులో ఆ యువకుడు వాహనాన్ని ఎత్తుకెళ్లినట్టు గుర్తించిన పోలీసులు తనిఖీలు చేపట్టగా.. కోదండపురంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద పోలీస్ కారును గుర్తించారు.