DRDO: యువతి వలకు చిక్కి.. భారత్ సీక్రెట్లు పాక్ చేతిలో పెట్టాడు
Delhi: యువతి వేసిన గాలంలో చిక్కిన ఓ DRDO సైంటిస్ట్.. ఇక్కడి సీక్రెట్లు పాకిస్థాన్ (pakistan) చేతుల్లో పెట్టేసాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ప్రదీప్ కురుల్కర్ డీఆర్‌డీఓలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి కొన్ని రోజుల క్రితం జారా దాస్‌గుప్తా అనే యువతి సోషల్ మీడియాలో పరిచయం అయిందట. యూకేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని పరిచయం పెంచుకుంది. ఆమె తన నగ్న వీడియోలన్నీ పెట్టి ట్రాప్ చేసింది. ఆమె వలలో చిక్కిన ప్రదీప్ రోజూ వాట్సాప్‌లో చాటింగ్ చేసేవాడు. అలా ఆ యువతి ఇండియాకు సంబంధించిన బ్రహ్మోస్, అగ్ని మిస్సైల్, మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్ ఇలా ఇక్కడి సీక్రెట్లు ఆమెకు చెప్పేసాడని విచారణలో తేలింది. యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ బృందం ఆ యువతి ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేస్తే పాకిస్థాన్‌కు చెందిన అమ్మాయి అని తెలిసింది. ఈ విషయం తెలీక ఇక్కడి విషయాలన్నీ చెప్పేసాడు ప్రదీప్.
ఆ యువతి, ప్రదీప్ జూన్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు చాటింగ్ చేసుకున్నారని విచారణలో తేలింది. అప్పటికే DRDOకి అనుమానం రావడంతో విచారణ చేపట్టడం ప్రారంభించింది. దాంతో ప్రదీప్ ఆమె నెంబర్‌ను బ్లాక్ చేసేసాడు. ఆ తర్వాత వేరే నెంబర్ నుంచి ఎందుకు బ్లాక్ చేసావ్ అన్న మెసేజ్ వచ్చినట్లు విచారణలో అన్ని విషయాలు బయటపడ్డాయి.