కుక్క కొరికిన బొమ్మ.. 54 లక్షలకు అమ్ముడుపోయింది!
UK: కుక్క కొరికిన గాట్లు, దుమ్ము పట్టిపోయిన ఓ బొమ్మ వేలం పాటలో ఏకంగా రూ.54 లక్షలకు అమ్ముడుపోయింది (viral news) . బ్రిటన్‌లో (britain) ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్న పిల్లాడి ఆకారంలో ఉన్న ఆ బొమ్మ యూకేకి చెందిన ఓ కుటుంబానికి చెందినది. వెక్టిస్ అనే సంస్థ ఏటా జరిపే బొమ్మల వేలం పాటలో ఈ బొమ్మను కూడా పెట్టారు. అయితే అప్పటికే ఆ బొమ్మ కాలిపై కుక్క గాట్లు, దుమ్ము పట్టినట్లుగా ఉంది. అయినా కూడా అది వందేళ్ల నాటి బొమ్మ అని వేలం పాటకు ఉంచారు. కానీ మరీ రూ.54 లక్షలకు అమ్ముడుపోతుందని ఆ కుటుంబం ఊహించలేదు.
క్యామర్ అండ్ రైన్‌హార్డ్ట్ అనే సంస్థ తయారుచేసే ఈ బొమ్మలు 20, 30 ఏళ్లకోసారి వేలం పాటకు వస్తాయని వెక్టిస్ సంస్థ తెలిపింది. కాకపోతే క్యామర్ అండ్ రైన్‌హార్డ్ట్ ఈ బొమ్మలను చిన్న పిల్లల కోసం కాకుండా యంగ్‌స్టర్స్ కోసం తయారుచేసేదట. కానీ జర్మనీలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ బొమ్మలను తయారుచేయడం మానేసారు. బొమ్మ సరిగ్గా లేనప్పటికీ ఇలాంటి అరుదైనవాటిని జాగ్రత్తగా ఉంచుకుంటే మెమొరీలా ఉండిపోతుందని రూ.54 లక్షలకు దక్కించుకున్న వ్యక్తి తెలిపాడు.