రెండేళ్లుగా తగ్గని దగ్గు.. వైద్య పరీక్షల్లో బయటపడిన షాకింగ్ అంశం
Cough: ఓ వ్యక్తి దాదాపు రెండేళ్లుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. అంతగా దగ్గుతున్నాడంటే కచ్చితంగా లంగ్ క్యాన్సర్ వచ్చి ఉంటుందేమో అని భయపడ్డాడు. అన్ని రకాల మందులు వాడినా తగ్గకపోవడంతో ఇక తప్పక వైద్యుల వద్దకు వెళ్లాడు.
ఆ వ్యక్తికి ఉన్న లక్షణాలు చూసిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఏదన్నా ట్యూమర్ లాంటిది ఉందేమో అని అనుమానించారు. ఆ తర్వాత అన్ని రకాల వైద్య పరీక్షలు చేసాక షాకింగ్ విషయం బయటపడింది. అందరూ అనుకున్నట్లు అతనికి ఎలాంటి క్యాన్సర్ లేదు. ఊపిరితిత్తుల్లో కణాల వెనకాల అతను రెండేళ్ల క్రితం తిన్న ఓ పచ్చిమిర్చి ఇరుక్కుని ఉంది.
అది అలా కణాల వెనక ఇరుక్కోవడం వల్ల అంతగా దగ్గుతో బాధపడ్డాడట. ఆ తర్వాత వెంటనే వైద్యులు సర్జరీ చేసి ఆ మిర్చిని బయటికి తీసారు. ఇప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఘటన చైనాలోని చేచియాండ్ నగరంలో చోటుచేసుకుంది.