పేషంట్ కడుపు నుంచి తీసిన వస్తువులివి..!
పై ఫోటోలో కనిపిస్తున్న వస్తువులు చూసి ఇదేదో అల్మారా నుంచి తీసి బయటపెట్టినవి అనుకుంటే పొరపాటే. ఇవన్నీ ఓ మనిషి కడుపులో (stomach) నుంచి తీసినవి. పంజాబ్‌కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని రోజుల పాటు విరోచనాలు అవుతున్నాయేమో అందుకే నొప్పిగా ఉందేమో అనుకున్నాడు. కానీ అలాంటిదేమీ లేదని తెలుసుకుని వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లాడు.
డాక్టర్లు అతని కడుపును స్కాన్ చేయగా రాఖీలతో సహా వివిధ రకాల వస్తువులు ఉండటం చూసి షాకయ్యారు. వెంటనే ఆపరేషన్ చేసి అవన్నీ తొలగించారు. ఇవన్నీ తొలగించినప్పటికీ ప్రస్తుతం అతని పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉందని తెలిపారు. దాదాపు రెండేళ్ల పాటు అతని కడుపులో ఈ వస్తువులు ఉన్నాయి. దాంతో అవి కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీసాయని డాక్టర్లు పేర్కొన్నారు. పేషెంట్‌కి మానసిక సమస్య ఉందని కానీ ఈ వస్తువులన్నీ అసలు ఎప్పుడు తినడం మొదలుపెట్టాడో తమకు తెలీదని కుటుంబ సభ్యులు తెలిపారు.