Nalgonda: “సిగ్గులేదూ.. ఎంత మందిని కంటావ్ “
Nalgonda: ఓ గర్భిణి డెలివరీ కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లగా.. అక్కడి వైద్యుడు ఆమెను అవమానించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ముస్లిం గర్భిణి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌లోని డాక్టర్ వద్దకు చెక్ చేయించుకోవడానికి వెళ్లగా.. ఆ డాక్టర్ ఎన్నో కాన్పు అని అడిగారు. సదరు మహిళ ఐదో కాన్పు అని తెలిపింది.
అది విని.. నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్ అంటూ నోటికొచ్చినట్టు డాక్టర్ అసభ్య పదజాలంతో బూతులు తిట్టిందని ఆ మహిళ కన్నీరు మున్నీరు అయ్యింది. ఈ విషయంపై మహిళ భర్త ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు.