Gaza: కుటుంబీకుల శ‌వాలు చూసి స్పృహ‌కోల్పోయిన డాక్ట‌ర్

Israel Gaza War: ఇంత‌కంటే బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న మరొక‌టి ఉంటుందా? ఓ ప‌క్క దేశంలో యుద్ధ ఘంటిక‌లు మోగుతుంటే.. మ‌రోప‌క్క గాయ‌ప‌డిన వారికి చికిత్స అందిస్తూ ఏ క్ష‌ణాన ఏమ‌వుతుందో అని భ‌య‌ప‌డుతూ జీవిస్తున్నారు గాజాలో నివ‌సిస్తున్న ఇయాద్ ష‌కూరా (iyad shaqura) అనే వైద్యుడు. ఇత‌నిది పాలెస్తీనా (palestine). ప్ర‌స్తుతానికి గాజాపై ఇజ్రాయెల్ (israel war) భీకర దాడుల‌కు పాల్ప‌డుతున్న నేప‌థ్యంలో రోజూ వందాల‌ది మంది తీవ్రంగా గాయ‌ప‌డుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. వీరికి చికిత్స అందిస్తున్న‌వారిలో ఇయాద్ ఒక‌రు.

ఈ నేప‌థ్యంలో ఇయాద్‌కు షాకింగ్ సంఘ‌ట‌న ఎదురైంది. రోజూ కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్న శవాల్లో త‌న కుటుంబానికి చెందిన‌వారు కూడా ఉన్నార‌ని తెలిసి అత‌ను స్పృహ‌కోల్పోయాడు. కాసేప‌టికి తేరుకుని చూడ‌గానే త‌న త‌ల్లి, ఇద్ద‌రు సోద‌రులు, ఇద్ద‌రు పిల్ల‌లు శ‌వాలుగా క‌నిపించారు. ఎవ‌రో చేసిన త‌ప్పుకు త‌న కుటుంబం ఎందుకు చ‌నిపోవాలి అంటూ రోదించాడు. అయినా చేసేదేమీ లేదు కాబ‌ట్టి దుఖాన్ని దిగ‌మింగుకుని వారిని పూడ్చిపెట్టి ఆ త‌ర్వాత విధుల్లో చేర‌తాన‌ని అంటున్నాడు.