Singham వంటి సినిమాలు సమాజానికి డేంజర్
సింగం (singham) లాంటి సినిమాలు సమాజానికి డేంజర్ అని అభిప్రాయపడ్డారు ముంబై హైకోర్టు (bombay high court) జడ్జి గౌతమ్ పటేల్. ఈ సినిమాలో పోలీస్‌ని ఒక రౌడీలాగా.. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని న్యాయం చేసేవారిలాగా చూపించారని అన్నారు. ముంబైలో శుక్రవారం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగం లాంటి సినిమాలు పోలీసులను గూండాలు, రౌడీలుగా చూపించారని ఇలాంటి అభిప్రాయమే జడ్జిలు, జర్నలిస్ట్‌లపై కూడా ఉందని తెలిపారు.
సంస్కరణలకు కట్టుబడి ఉంటడం పోలీసులకే కాదు సమాజానికి కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. న్యాయస్థానాలపై ప్రజలకు నమ్మకం పోతే వారు పోలీసులు తీసుకునే యాక్షన్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారని క్రిమినల్స్‌ని ఎన్‌కౌంటర్ చేసినప్పుడు కూడా ప్రజలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని అన్నారు. సినిమాలో పోలీసులే వేగంగా న్యాయం జరిగేలా చూస్తారు అని చూపించడం తప్పని తెలిపారు. పోలీసులు కూడా కొన్ని న్యాయవ్యవస్థల ప్రక్రియలకు లోబడి ఉండాలని.. సినిమాలో పోలీస్ ఎలాంటి న్యాయలు, ధర్మాలను పాటించకుండా కాపాడేస్తాడని ప్రజలు అనుకుంటే అది వారి అమాయకత్వమే అవుతుందని పేర్కొన్నారు.