Divorce: ఈ దేశాల్లోనే విడాకులు ఎక్కువట!
Hyderabad: ఒకప్పుడు విడాకులు(divorce) తీసుకోవాలంటే ఒకటికి రెండు, మూడు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు విడిపోవాలన్న(divorce) ఆలోచన రావడం ఆలస్యం.. అలా కోర్టు మెట్లెక్కి ఇలా విడాకులు తెచ్చేసుకుంటున్నారు. అమెరికాకు చెందిన ఓ సర్వే ప్రకారం.. కోవిడ్ తర్వాత ఈ దేశాల్లోనే విడాకుల రేటు ఎక్కువగా ఉందట.
మోల్డోవా
ఇదొక యూరోపియన్ దేశం. ఈ దేశంలో పెద్ద పెద్ద సిటీల్లోనే ఎక్కువ విడాకులు అవుతున్నాయట. కోవిడ్ తర్వాత నుంచి ఇప్పటివరకు 9,905 విడాకుల కేసులు నమోదయ్యాయి.
బెలారస్
ఇది తూర్పు యూరప్‌లోని దేశం. 34,386 విడాకుల కేసులు నమోదయ్యాయి.
అరూబా
నెదర్లాండ్స్‌కు చెందిన ఈ ప్రదేశంలో కోవిడ్ తర్వాత నుంచి ఇప్పటివరకు 314 విడాకుల కేసులు నమోదయ్యాయి. ఇది చాలా తక్కువ కదా అనుకుంటున్నారా? ఈ ప్రదేశంలో కేవలం 115,576 మందే ఉంటున్నారు. అలా పోలిస్తే డైవర్స్ కేసులు ఎక్కువే అని చెప్పచ్చు.
జార్జియా
ఏషియన్-యూరోపియన్ దేశం అయిన జార్జియా ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశాల్లో ఒకటి. అక్కడ 10,654 విడాకుల కేసులు నమోదయ్యాయి.
కోస్టారికా
సెంట్రల్ అమెరికన్ దేశం అయిన కోస్టారికా సంతోషకరమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. అయినప్పటికీ అక్కడ 14,543 విడాకుల కేసులు నమోదయ్యాయి.
లిథ్వేనియా
బాల్టిక్ యూరోపియన్ దేశమైన లిథ్వేనియా జనాభా 2.8 మిలియన్. అక్కడ విడాకుల కేసులు 7,822.
డొమినికన్ రిపబ్లిక్
కరీబియన్ ద్వీపానికి చెందిన ఈ ప్రాంతంలో 28,694 కేసులు.
ఖజకిస్థాన్
2021లోనే 48,239 విడాకుల కేసులు నమోదయ్యాయి.
లాత్వియా: 2021లో 4,643 కేసులు
అమెరికా: 689,308 కేసులు
స్వీడెన్: 23,647 కేసులు
డెన్మార్క్: 12,886 కేసులు