Disease X: ముంచుకొస్తున్న మరో ప్రాణాంతక వైరస్.. కోవిడ్ కంటే ప్రమాదకరమా?
Disease X: కోవిడ్ (covid) యావత్ ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో చూసాం. ఇప్పుడిప్పుడే దాని నుంచి ఆర్ధిక వ్యవస్థలు కూడా కోలుకుంటున్నాయి. ఇప్పుడు మరో ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచంపై దాడి చేయబోతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. ఈ వ్యాధి పేరు X. ఇదొక జూనాటిక్ వైరస్. జూనాటిక్ అంటే జంతువుల నుంచి మనుషులకు లేదా మనుషుల నుంచి జంతువులకు వ్యాపించేది అని అర్థం. ఈ X అనే తర్వాత రాబోయే ప్యాండెమిక్ వైరస్ మాత్రం కోవిడ్ కంటే 20 రెట్లు ప్రమాదకరమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
దాదాపు 5 కోట్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని చెప్తున్నారు. ఈ X వ్యాధి గురించి లండన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ అనే సంస్థ బయటపెట్టింది. ఇది కోవిడ్ కంటే ఎక్కువ ప్రమాదకరం అని చెప్పడానికి 27.5 శాతం అవకాశం ఉందని అంటున్నారు. కాకపోతే ఈ వైరస్ 2033లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇప్పటికైతే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగని శాస్త్రవేత్తలు కూడా దీనిని తేలికగా తీసుకోవడం లేదు. అసలు ఏ వైరస్ వస్తుందో ముందే కనిపెట్టి నివారించే పనిలో పడ్డారు. ఒకవేళ ఈ X వ్యాధిని ఇప్పటినుంచే అడ్డుకట్ట వేయకపోతే 2033లో కేవలం లండన్‌లోనే ఒక్కో రోజు 15000 మందిని బలితీసుకునే అవకాశం ఉంది. ఈ X అనేది ఊపిరితిత్తుల్లో వచ్చే వైరస్. ఇలా ఊపిరితిత్తుల్లో మాత్రమే వచ్చే వైరస్‌లు అంత త్వరగా పోవు. అందుకే వైద్యులు, శాస్త్రవేత్తలు ఇప్పటినుంచే రీసెర్చ్‌లు మొదలుపెట్టేసారు.