Dimple Hayathi: ఐపీఎస్ కారును తన్నిన హీరోయిన్
Hyderabad: ఇటీవల విడుదలైన రామబాణం(Ramabanam) సినిమా హీరోయిన్ డింపుల్ హయాతీ(Dimple Hayathi) వివాదంలో చిక్కుకుంది. ఓ ఐపీఎస్ ఆఫీసర్‌తో గొడవపడి అతని కారును తన్నిన డింపుల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఖిలాడీ, రామబాణం వంటి సినిమాల్లో నటించినా డింపుల్‌కి ఆశించిన విజయం అందలేదు. గద్దలకొండ గణేష్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ వివాదంతో వార్తల్లో నిలిచింది డింపుల్.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జూబ్లీ హిల్స్ హుడా ఎన్‌క్లేవ్‌లో ఎస్‌కేఆర్ అపార్ట్‌మెంట్స్‌లో డింపుల్ హయాతి తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో ఓ ఐపీఎస్ ఆఫీసర్ కూడా నివాసం ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయంలో సదరు ఐపీఎస్ ఆఫీసర్‌తో డింపుల్, ఆమె స్నేహితుడు కలిసి గొడవ చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ కారు పార్కింగ్ స్థలంలోనే డింపుల్ తమ కారుని పార్క్ చేసేవారు. దీనిపై వారికి పలు మార్లు గొడవైంది.
తాజాగా డింపుల్ సదరు ఐపీఎస్ ఆఫీసర్ కారుని ఉద్దేశపూర్వకంగా కాలితో తంతూ గొడవ చేసింది. అక్కడున్న డ్రైవర్‌తోనూ ఆమె గొడవ పడింది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డింపుల్ హయాతి, ఆమె ఫ్రెండ్‌పై క్రిమినల్ కేసుని నమోదు చేశారు. మరి ఈ వివాదంపై డింపుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.