నేను చస్తే వారిని చంపేయండి.. చచ్చే ముందే సిన్వార్ మెసేజ్
Yahya Sinwar: హమాస్ అధినేత యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే.. తన చావును ముందే గ్రహించిన సిన్వార్.. హమాస్ సంస్థకు ఓ మెసేజ్ ముందు ఇచ్చేసారట. తనని చంపగానే వెంటనే హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను పిట్టలు కాల్చినట్లు కాల్చేయాలని సిన్వార్ చెప్పి పెట్టాడట. దాంతో ఇజ్రాయెల్ బందీలు ప్రాణాలతో ఉంటారో లేదో తెలీడంలేదని ఇజ్రాయెల్‌కి చెందిన బందీల మీడియేటర్ గెర్షోన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను చంపేసారని తెలిపారు. ప్రస్తుతం హమాస్ చెరలో 101 ఇజ్రాయెల్ వాసులు బందీలుగా ఉన్నారు. వారిలో 60 మంది ప్రాణాలతో ఉన్నట్లు తెలుస్తోంది.
సిన్వార్ మరణంతో అతని స్థానాన్ని సోదరుడు మహ్మద్ భర్తీ చేసారు. మరోపక్క ఇజ్రాయెల్ తమ బందీలను విడిపించేకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని హమాస్‌కి సమాచారం చేరవేసింది. ఈ విషయంలో అమెరికా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో మాట్లాడి ఆ 60 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేలా చేయాలని బాస్కిన్ అభిప్రాయపడ్డారు.