Hamas: అమ్మ కిమ్‌గా.. కామ్‌గా ఆయుధాలు ఇచ్చావా..?
Israel Gaza War: ఉత్తర కొరియా (north korea) కపట బుద్ధి బయటపడింది. అసలు తాము తీవ్రవాదులకు ఉగ్రవాదులకు ఎలాంటి ఆయుధాలు ఎగుమతి చేయము అంటూనే..గాజాకు (gaza) చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ (hamas) చేతికి ఆయుధాలను అందించింది. మొన్న అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉత్తర కొరియా ఇచ్చిన ఆయుధాలతోనే దాడులు చేసినట్లు ఓ నివేదిక బయటికి వచ్చింది.
ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు హమాస్ F-7 రాకెట్ ఆధారతి గ్రెనేడ్లను వాడింది. ఈ F-7 ఆయుధాలను ఎక్కువగా ఉత్త కొరియా తయారుచేస్తుంటుంది. దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు చేపట్టిన విచారణలో హమాస్ ఉగ్రవాదులు వాడిన ఆయుధాలు F-7 గ్రెనేడ్లేనని తేలింది. దీనిని బట్టి చూస్తే హమాస్‌కు ఆయుధాలను అందించింది ఉత్తర కొరియానే అని క్లియర్‌గా అర్థమవుతోంది. గతంలో కూడా ఉత్తర కొరియా పాలెస్తీనాకు చెందిన తీవ్రవాదులకు ఆయుధాలతో సపోర్ట్ చేస్తుండేది. మిలిటరీ ప్రోగ్రామ్స్‌కి ఫండింగ్ కోసం ఇలా అక్రమంగా ఆయుధాలను సరఫరా చేసుకునేవారు.
గతంలో ఉత్తర కొరియాకు సంబంధించిన ఆయుధాలను సిరియా, లెబనన్, ఇరాక్‌లలో జరిగిన దాడుల్లోనూ బయటపడ్డాయి. ఆ ఆరోపణలపై ఉత్తర కొరియా స్పందిస్తూ కావాలనే తమపై బురద జల్లాలని చూస్తున్నారని తాము ఎలాంటి తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు సరఫరా చేయడంలేదని తెలిపింది. F-7లతో పాటు హమాస్ ఉగ్రవాదులు ఉత్తర కొరియాకు చెందిన బుల్సే యాంటీ ట్యాంక్ మిస్సైల్, టైప్ 58 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ వాడినట్లు తెలుస్తోంది.