దంతాల‌కు స‌ర్జ‌రీ.. గుండెపోటుతో వ్యక్తి మృతి

dental surgery led to heart attack

Heart Attack: దంతాల‌కు స‌ర్జరీ చేస్తే.. అది కాస్తా గుండెపోటుకు దారితీసింది. దాంతో ఆ పేషెంట్ చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న చైనాలో చోటుచేసుకుంది. యోంగ్‌కాంగ్ డీవే అనే హాస్పిట‌ల్‌కు వెళ్లిన ఓ వ్య‌క్తి త‌న 23 దంతాల‌ను పీకించేసుకుని కొత్త‌వి పెట్టించుకున్నాడు. ఈ స‌ర్జ‌రీ జ‌రిగిన 13 రోజుల‌కే అత‌ను గుండెపోటుతో చ‌నిపోయాడు. ఈ విష‌యాన్ని అత‌ని కూతురు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో చైనాలో సంచ‌ల‌నంగా మారింది. ఆ వ్య‌క్తికి స‌ర్జ‌రీ చేసిన వైద్యుడు చిన్నా చిత‌కా వ్య‌క్తి కాదు. అత‌నికి డెంటిస్ట్‌గా రూట్ కెనాల్ ఎక్స్‌ప‌ర్ట్‌గా ఐదేళ్ల అనుభ‌వం ఉంది. అయిన‌ప్ప‌టికీ ఇలా స‌ర్జ‌రీ విక‌టించి పేషంట్ చ‌నిపోవ‌డంతో ఆ హాస్పిట‌ల్‌పై కేసు న‌మోదైంది.

అయితే.. చైనాకు చెందిన సీనియ‌ర్ డాక్ట‌ర్ ఒక‌రు ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ.. సాధార‌ణంగా మాగ్జిమం కేవ‌లం 10 దంతాల‌ను మాత్ర‌మే ఒకేసారి పీకగ‌లం అని.. 23 దంతాలు ఎలా పీకేసారో త‌న‌కు అర్థంకావ‌డంలేద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు అస‌హ‌జ మ‌ర‌ణంగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.