Delivery Boy రేప్ చేయబోతే… సంబంధం లేదన్న కంపెనీ!
Hyderabad: ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చి అదను చూసి ఓ యువతిపై రేప్ చేయబోయాడు ఓ డెలివరీ బాయ్ (delivery boy). ఆ అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని కంపెనీకి కంప్లైంట్ చేస్తే.. డెలివరీ ఇవ్వడం వరకే మా బాధ్యత. ఆ తర్వాత అతను ఏం చేసినా మాకు సంబంధం లేదు అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఈ ఘటన జరిగింది ఇండియాలో (india) కాదులెండి. ఇక్కడ ఏ డెలివరీ బాయ్ అలా చేయడానికి సాహసం చేయడు. ఒకవేళ చేసినా కంపెనీలు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాయి. ఈ ఘటన జరిగింది అమెరికాలో (america).
అమెరికాలో డోర్ డ్యాష్ డెలివరీ సంస్థ చాలా ఫేమస్. ఈ నేపథ్యంలో క్లోయీ అనే 18 ఏళ్ల యువతి డోర్ డ్యాష్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. ఈ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి యంగ్ అనే వ్యక్తి వెళ్లాడు. వెళ్లి డెలివరీ ఇచ్చి రాకుండా క్లోయీపై ఎటాక్ చేసాడు. ఆమెపై ఎక్కడబడితే అక్కడ చేతులు వేస్తూ.. వేళ్లు, మెడ కొరికేసాడు. చుట్టుపక్కల వారు రావడంతో అతను పారిపోయాడు. ఆ తర్వాత క్లోయీ డోర్ డ్యాష్ కంపెనీకి కంప్లైంట్ ఇచ్చింది. అయితే వారు ఇచ్చిన ఆన్సర్ మరింత షాక్‌కు గురిచేసింది. ఫుడ్ డెలివరీ గురించి ఏమన్నా ఉంటే చెప్పండి. ఇలాంటివి మాకు సంబంధంలేదు అన్నారట.
దాంతో క్లోయీ పోలీసులకు కంప్లైంట్ చేసింది. విచారణలో నిందితుడు యంగ్‌పై ఆల్రెడీ క్రిమినల్ రికార్డులు ఉన్నాయని తెలిసింది. హిట్ అండ్ రన్ కేసులో అతను జైలు నుంచి రిలీజ్ అయ్యాక డోర్ డ్యాష్ కంపెనీ డెలివరీ బాయ్‌గా (delivery boy) పెట్టుకుందట. దాంతో కోర్టు కంపెనీకి జరిమానా విధించింది. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.