Delhi Crime: ఫ్రెండ్ కూతురిపై అధికారి రేప్
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది (delhi crime). చైల్డ్ డెవలెంప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి ఫ్రెండ్ కూతురిపైనే పలుమార్లు రేప్‌కి పాల్పడ్డాడు. ఇంకా దారుణం ఏంటంటే.. ఆ అమ్మాయి గర్భం దాల్చడంతో తప్పు కప్పిపుచ్చడానికి అతని భార్య దగ్గరుండి అబార్షన్ చేయించింది.
నెలల తరబడి అత్యాచారం
కొన్ని నెలల తరబడి ఆ కీచకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ అమ్మాయి తండ్రి 2020లో ఓ ప్రమాదంలో చనిపోయాడు. దాంతో జాలిపడి ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకున్నాడు. అలా చేరదీసిన ఆ వ్యక్తే 2020 నుంచి 2021 వరకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి గర్భందాల్చింది. విషయం బయటికి పొక్కితే ఎక్కడ పరవుపోయి తన భర్త ఉద్యోగం పోతుందోనని నిందితుడి భార్య ఎవ్వరికీ తెలీకుండా అబార్షన్ పిల్స్ ఇచ్చి కడుపుపోయేలా చేసింది. (delhi crime)
పోలీసులకు ఫిర్యాదు
ఈ బాధ భరించలేక ఆ అమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో విషయం బయటపడింది. ప్రస్తుతం ఆ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. తప్పును కప్పిపుచ్చాలని చూసిన అతని భార్యను కూడా అరెస్ట్ చేసారు. (delhi crime)