Delhi Hospital Fire: హాస్పిటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 6 పసికందులు మృతి
Delhi Hospital Fire: ఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి స్థానిక పిల్లల హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు పసికందులు దుర్మరణం చెందగా.. 12 మంది పిల్లల్ని రక్షించారు. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ఏరియాలో ఉన్న బేబీ కేర్ సెంటర్ హాస్పిటల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం ఎలా చోటుచేసుకుంది అనే దానిపై ఇంకా విచారణ జరుగుతోంది. హాస్పిటల్ యజమానిపై కేసు నమోదైంది.