Deepti Case: మహానటి.. చెల్లే చంపేసింది
కోరుట్లకు (korutla) చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బంక దీప్తి (deepti case) హత్య కేసులో షాకింగ్ విషయాలను పోలీసులు వెల్లడించారు. దీప్తిని చంపింది ఆమె చెల్లి చందన, (chandana) ప్రియుడు అని వెల్లడించారు. చందన ఓ ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఇంట్లోవారు ఒప్పుకోరని లేచిపోవాలనుకున్నారు. ఇంట్లో ఉన్న బంగారంతో పారిపోవాలని ప్లాన్ వేసారు. ఈ విషయం దీప్తికి తెలీడంతో వారిని ఆపేందుకు యత్నించింది. అప్పుడు చందన, ఆమె ప్రియుడు దీప్తి ముఖం మొత్తం ప్లాస్టర్తో చుట్టేసి చేతులు కట్టేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దాంతో దీప్తి ఊపిరాడక చనిపోయింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు నగలను కూడా జప్తు చేసుకున్నారు. (deepti case)
ఎక్కడ పోలీసులకు నిజం తెలిసిపోతుందోనని ముందే చందన తన తమ్ముడు సాయికి నిన్న వాయిస్ మెసేజ్ పంపింది. అందులో “” అరేయ్ సాయి నేను చందన అక్కనురా.. నిజమెంటో చెప్పాలారా. దీప్తి అక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత మందు తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ని పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా.
నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నా. ఇది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నా. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయా. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి, నా తప్పేం లేదు ప్లీజ్ నమ్మరా. మేం రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయా. ఇలా అవుతుంది అనుకోలేదు. అక్కను నేనెందుకు మర్డర్ చేస్తాను “” అని ప్లాన్ ప్రకారం ముందే స్క్రిప్ట్ రాసుకుంది.