Darshan Thoogudeepa: జైలు నుంచి మిడిల్ ఫింగ‌ర్ చూపించిన ద‌ర్శ‌న్

Darshan Thoogudeepa shows middle finger to media

Darshan Thoogudeepa: రేణుకా స్వామి అనే వ్య‌క్తి మ‌ర్డ‌ర్ కేసులో బ‌ళ్ళారి జైల్లో ఉన్న క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ తూగుదీప‌కు సంబంధించి ఓ వార్త వైర‌ల్ అవుతోంది. ఆయ‌న‌ను ముందు ప‌ర‌ప్ప‌ణ అగ్ర‌హార జైలులో ఉంచిన‌ప్పుడు అక్క‌డి వ్య‌క్తుల‌తో క‌లిసి సిగ‌రెట్ తాగుతూ వీఐపి ట్రీట్మెంట్ ఎంజాయ్ చేస్తున్నార‌ని ఓ ఫోటో బ‌య‌టికి వ‌చ్చింది. దాంతో ఆయ‌న్ను వెంట‌నే బ‌ళ్ళారి జైలుకు త‌ర‌లించారు. నిన్న ద‌ర్శ‌న్ కుటుంబ స‌భ్య‌లు ఆయ‌న్ను చూసేందుకు బ‌ళ్ళారి జైలుకి వెళ్ల‌గా.. ఆ స‌మ‌యంలోద‌ర్శ‌న్ బ‌య‌టికి వ‌చ్చారు. అప్పుడు మీడియా వ‌ర్గాలు ఆయ‌న ఫోటోలు తీస్తుంటే మ‌ధ్య వేలు చూపించారు. ఆ ఫోటో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఇంత జ‌రిగినా అరెస్ట్ చేసినా ద‌ర్శ‌న్‌లో ఇంకా ఏమాత్రం పొగ‌రు త‌గ్గ‌లేదంటూ నెటిజ‌న్లు కామెంట్స్ రూపంలో ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.