Darshan Thoogudeepa: జైల్లో దర్జాగా..!

darshan thoogudeepa chilling in jail

Darshan Thoogudeepa: ప్ర‌ముఖ క‌న్నడ న‌టుడు ద‌ర్శ‌న్ తూగుదీప‌.. రేణుకా స్వామి అనే వ్య‌క్తి హ‌త్య కేసులో జైల్లో శిక్ష అనుభ‌విస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ద‌ర్శ‌న్ ఓ సాధార‌ణ ఖైదీ జీవితాన్ని గ‌డప‌డం లేద‌ని లీకైన ఓ ఫోటోను బట్టి తెలుస్తోంది. ముగ్గురు వ్య‌క్తుల‌తో క‌లిసి కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ క‌బుర్లు చెప్పుకుంటున్న స‌మ‌యంలో ఎవ‌రో ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేసారు. దాంతో ద‌ర్శ‌న్ జైల్లో ద‌ర్జాగా గ‌డిపేస్తున్నాడ‌ని.. రేణుకా స్వామికి న్యాయం జ‌ర‌గ‌న‌ట్లే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ద‌ర్శ‌న్ బెంగ‌ళూరు సెంట్ర‌ల్ జైల్లో శిక్ష అనుభ‌విస్తున్నారు. అయితే ముగ్గురు వ్యక్తుల‌తో క‌లిసి గార్డెన్‌లో కూర్చున్నట్లుగా సేద తీరుతూ ఓ ప‌క్క కాఫీ మ‌రో చేతిలో సిగ‌రెట్ ఉండ‌టం వివాదాస్ప‌దంగా మారింది. దీనిపై సెంట్ర‌ల్ జైలు అధికారులు స్పందించాల్సి ఉంది.