Darshan Thoogudeepa: నేను ఛాతిపై త‌న్నా.. ప‌విత్ర చెప్పుతో కొట్టింది.. ఒప్పుకున్న ద‌ర్శ‌న్

Darshan Thogudeepa admits hitting renuka swamy

Darshan Thoogudeepa: క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ తూగుదీప మొత్తానికి పోలీసుల విచార‌ణ‌లో తాను రేణుకా స్వామి ప‌ట్ల ప్ర‌వ‌ర్తించిన తీరును ఒప్పుకున్నాడు. రేణుక మెసేజ్‌ల‌తో టార్చ‌ర్ పెడుతున్నాడ‌ని పవిత్ర గౌడ చెప్ప‌డంతో అత‌న్ని పిలిపించాన‌ని.. అత‌ను రాగానే ఛాతిపై త‌ల‌పై కాలితో త‌న్నాన‌ని.. ఆ త‌ర్వాత ప‌విత్ర చెప్పుతో దాడి చేసింద‌ని తెలిపాడు. నేను రేణుకా స్వామిని చూసేస‌రికే అత‌ను నీర‌సంగా క‌నిపించాడు. నాకు కోపం కంట్రోల్ కాలేదు. త‌ల‌పై, ఛాతిపై కాలితో త‌న్నాను. చేత్తో ప‌లు మార్లు కొట్టాను. ఆ త‌ర్వాత చెక్క క‌ర్ర‌తో కొట్టాను. ఆ త‌ర్వాత ప‌విత్ర చేత చెప్పుతో కొట్టించాను అని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. విచార‌ణ మొత్తంలో తేలింది ఏంటంటే.. ఈ కేసులో ఏ1గా ఉన్న ప‌విత్ర గౌడే అంతా చేయించింది. ప‌విత్రే ద‌ర్శ‌న్‌కు త‌న‌తో రేణుక ప్ర‌వ‌ర్తిస్తున్న విధానం గురించి చెప్పి అత‌న్ని ఏదో ఒక‌టి చేయాల‌ని రెచ్చ‌గొట్టింది. ప‌విత్ర కోస‌మ‌ని ద‌ర్శ‌న్ అత‌ని చావుకి కార‌ణ‌మ‌య్యాడు.