Covid: కేర‌ళ‌లో మ‌ళ్లీ పెరుగుతున్న కోవిడ్.. ఈసారి కొత్త వేరియంట్‌తో

Covid: కోవిడ్ త‌గ్గుముఖం ప‌ట్టిందనుకుంటే మ‌ళ్లీ మొద‌లైంది. కేర‌ళ‌లో ఓమిక్రాన్ JN.1 అనే ఉప వేరియంట్ కేసులు అధిక‌మ‌వుతున్న‌ట్లు కేర‌ళ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అయితే దీని గురించి పెద్ద‌గా చింతించాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొంది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల‌కు చెందిన అయ్య‌ప్ప భ‌క్తులు అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి శ‌బ‌రిమ‌లై వెళ్తున్నారు. వారు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు మాస్కులు పెట్టుకుంటూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసారు.