Wedding: పెళ్లికి వచ్చిన అతిథులకు షాక్
Wedding: సాధారణంగా పెళ్లంటే చుట్టాలు, స్నేహితులు, సన్నిహితులను పిలిచి ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. కొందరైతే మీకు మా పెళ్లికి వస్తే చాలు ఎలాంటి కానుకలు తీసుకురాకండి అని శుభలేఖల్లో రాస్తుంటారు. కానీ అమెరికాకి చెందిన ఓ జంట మాత్రం పెళ్లికి వచ్చిన అతిథులకు షాక్ ఇచ్చింది. దాంతో వారు ఇక జన్మలో పెళ్లిళ్లకు వెళ్తారో లేదో డౌటే. అమెరికాకి చెందిన జెఫ్, సోఫీలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు మెయిల్ ద్వారా ఇన్విటేషన్ కార్డులు పంపారు.
అయితే కార్డు కింద పేమెంట్ చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి అని ఉండటాన్ని చూసి జెఫ్ స్నేహితుడు జ్యాక్ షాకయ్యాడు. ఇదేమన్నా సైబర్ మోసమేమో అని భయపడి వెంటనే జెఫ్కి ఫోన్ చేసాడు. అందులో ఎలాంటి మోసం లేదు.. పెళ్లికి రావాలనుకుంటే డబ్బులు కట్టాల్సిందే అని చెప్పడంతో అతను విస్మయానికి గురయ్యాడు.
ప్రాణ స్నేహితుడి పెళ్లి కావడంతో ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ రూ.2 లక్షలు కట్టాలి అని ఉంటే కట్టేసాడు. ఆ తర్వాత పెళ్లికి వెళ్తే తెలిసింది ఏంటంటే.. పెళ్లికి వచ్చిన వారందరి చేత ఇలాగే డబ్బులు కట్టించుకున్నారట. పాపం జ్యాక్ దరిద్రం ఏంటంటే.. పెళ్లి అయిపోయాక కూడా రూ.25 వేలు బాకీ పడ్డాడు. తన వద్ద డబ్బులు లేకపోవడంతో రిక్వెస్ట్ చేసి తన వద్ద ఉన్నంత డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. ఈ విషయాన్ని జ్యాక్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ బాధపడ్డాడు. ఇంకెప్పుడు జెఫ్తో మాట్లాడనని.. అతనితో స్నేహబంధాన్ని తెంచుకుంటున్నానని వెల్లడించాడు.