ఆఫీస్‌లో ఉద్యోగుల రొమాన్స్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కొలీగ్స్
China: ఓ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆఫీస్‌లోనే ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న లీ అనే వ్యక్తి.. అదే కంపెనీలో పనిచేస్తున్న మియాతో ఎఫైర్ పెట్టుకున్నాడు. వీరిద్దరూ వివాహితులే. అయినా ఆఫీస్‌లో అక్రమ సంబంధం నడుపుతున్నారు. ఓసారి లీ భార్య అతను మియాతో చేసిన చాటింగ్ చూసి షాకైంది. వెంటనే ఈ విషయాన్ని కంపెనీ మేనేజర్‌కు చెప్పింది. దాంతో లీ ఆఫీస్‌కి వెళ్లగానే మేనేజర్ ఇదేం పద్ధతి అంటూ పెద్ద గొడవ చేసాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు లీని సెలవులపై పంపాడు.
ఇక్కడి వరకు బాగానే ఉంది అనుకుంటుండగా.. సెలవుల తర్వాత లీ ఆఫీస్‌కి వెళ్లాడు. ఆఫీస్‌కి వెళ్లిన రోజే మియాతో రొమాన్స్ చేస్తూ ఇతర కొలీగ్స్‌కి దొరికిపోయాడు. దాంతో వారు మేనేజర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వారిద్దరినీ ఉద్యోగాల నుంచి తీసేసారు. చేసింది వెధవ పని. క్షమించమని అడగాల్సిందిపోయి ఆ ఇద్దరు ఉద్యోగులు కంపెనీపై కేసు వేసారు. తమ ఇద్దరినీ ఉన్న పళంగా ఉద్యోగం నుంచి తీసేసారని ఇందుకు తమకు చెరో రూ.3 లక్షలు పరిహారంగా చెల్లించాలని పిటిషన్‌లో కోరారు. కోర్టు వాదోపవాదాలు విన్నాక కంపెనీకే మద్దతు ఇచ్చింది. వారిద్దరినీ ఉద్యోగం నుంచి తీసేయడం మంచి పనే అని పరిహారం చెల్లించాల్సిన అవసరం కూడా లేదని ఆదేశాలు జారీ చేసింది.