Kakinada: పొదల్లో ఏం చేస్తున్నారని అడిగితే దాడి!

Kakinada: ఓ జంట పొద‌ల్లో క‌న‌ప‌డ‌టంతో ఇక్క‌డ ఏం చేస్తున్నారు అని అడిగినందుకు ఆ వ్య‌క్తిపై వారిద్ద‌రూ దాడి చేసారు. కాకినాడలోని (kakinada) కరప మండలం పెనుగుదురుకి చెందిన మధుసూధనరావు అనే వ్యక్తి గ్రామంలోని రహదారిపై వెళ్తుండగా చీకట్లో ఓ అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడం చూశాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు.. ఇలా చీకట్లో పొద‌ల్లో ఏం ప‌ని అని నిల‌దీసాడు. దాంతో ఆ అబ్బాయి మధుసూధనరావుపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి సైతం తెలిసిన వారికి ఫోన్ చేయగా సంఘటనా స్థలానికి మరో ఇద్దరు వచ్చారు. వారంతా క‌లిసి మ‌ధుసూద‌న‌రావుపై దాడికి పాల్పడ్డారు. దాంతో అత‌నికి గాయాలు అయ్యాయి. స్థానికులు ఆయ‌న్ను ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఆ త‌ర్వాత ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.