Sukesh Chandrasekhar: ఇక చూస్కో.. ఎవ్వరికీ తెలీని విషయాలు బయటపెడతా
Sukesh Chandrasekhar: రూ.200 కోట్ల దోపిడీ కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తన మాజీ ప్రేయసి అయిన జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌ను (jacqueline fernandez) బెదిరిస్తున్నాడు. జైల్లో కూర్చుని నా బుట్ట బొమ్మ.. నా ముద్దు గుమ్మ అంటూ జాక్వెలీన్‌కు లేఖలు పంపుతున్న సుఖేష్‌పై జాక్వెలీన్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా అతను జైల్లో కూర్చుని తనకు లెటర్లు పంపుతూ టార్చర్ పెడుతున్నాడని వాపోయింది. తనను సుఖేష్ తెలివిగా మోసం చేసాడని.. ఇప్పటికైనా తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరింది. ఈ విషయం జైల్లో ఉన్న సుఖేష్‌కు తెలీడంతో అతనికి కోపం వచ్చింది. ఇక చూస్కో ఎవ్వరికీ తెలీని ఎవ్వరూ చూడని విషయాలన్నీ బయటపెడతాను అంటూ జాక్వెలీన్‌ను బెదిరిస్తున్నాడు.
తన వద్ద కోట్లల్లో డబ్బు ఉందని జాక్వెలీన్‌ను నమ్మించి ఖరీదైన కానుకలతో ఆమెను వల్లో వేసుకున్నాడు సుఖేష్. దాంతో అతన్ని పెళ్లి చేసుకోవాలని జాక్వెలీన్ అనుకుంది. తీరా చూస్తే అతనో మోసగాడు అని తెలిసి షాకైంది. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్‌లో జాక్వెలీన్ పేరును కూడా చేర్చారు.