AI: ఆడవాళ్లను నగ్నంగా చూపించే యాప్స్.. పెరుగుతున్న వినియోగం
AI: ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తోందంటే టెక్నాలజీ పెరుగుతుందని ఉద్యోగాలు కూడా పెరుతాయని అనుకున్నారు. కానీ మానవాళికే ప్రమాదకరంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ అనే వీడియోలు ఎంతో వివాదాస్పదంగా మారాయి. ఇలాంటి వీడియోలపై కేంద్ర ప్రభుత్వం కూడా కొరడా ఝళిపించింది. ఇప్పుడు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో కొన్ని భయంకరమైన యాప్స్ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
అమ్మాయిలు దుస్తులు వేసుకున్నా కూడా వారిని నగ్నంగా చూపించే యాప్స్ పాపులారిటీ ఇప్పుడు ఎక్కువైపోయిందట. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏఐ యాప్స్‌లో ఈ అన్‌డ్రెసింగ్ యాప్స్ హవా ఎక్కువగా ఉందని సోషల్ నెట్‌వర్క్ ఎనాలసిస్ కంపెనీ గ్రాఫికా వెల్లడించింది. 2023లోనే ఈ యాప్స్ వాడుక సంఖ్య 2400% పెరిగిందని పేర్కొంది. ఈ యాప్‌ని ట్విటర్, రెడిట్‌లో వాడుతున్నారట. ఎక్కువగా మహిళల ఫోటోలను పెట్టి వారిని నగ్నంగా చూపించేందుకు వినియోగిస్తున్నారని గ్రాఫికా వెల్లడించింది.
ఈ యాప్ ద్వారా తయారయ్యే ఇమేజ్‌లు ఎంత రియలిస్టిక్‌గా ఉంటాయంటే నిజంగానే దుస్తులు లేకుండా ఫోటోలు దిగారా అన్న సందేహం కలగకమానదు. అమ్మాయిల ఫోటోలను ఈ అన్‌డ్రెసింగ్ యాప్స్‌లో పెట్టి వారు దుస్తులు లేకుండా ఉన్నట్లు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారట.