Hyderabad రెస్టారెంట్ నిర్వాకం..బిర్యానీలో బొద్దింక
Hyderabad: చికెన్ బిర్యానీలో(chicken biryani) బొద్దింక(cockroach) రావడంతో ఓ హైదరాబాద్(hyderabad) యువకుడు కంగుతిన్నాడు. వెంటనే రెస్టారెంట్‌కి ఫోన్ చేసి చెప్తే.. సారీ అండి ఈ మధ్యనే పెస్ట్ కంట్రోల్ చేయించాం అని చెప్పి పెట్టేసారట. అయినా ఆ యువకుడు వదల్లేదు. కోర్టు వరకు వెళ్లి కేసు గెలిచాడు కూడా. అసలే జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన అరుణ్.. 2021లో అమీర్‌పేట్‌లోని కెప్టెన్ కుక్ రెస్టారెంట్ నుంచి చికెన్ బిర్యానీ పార్సెల్ తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లి పార్సిల్ ఓపెన్ చేయగానే అందులో నుంచి బొద్దింక వచ్చింది. దాంతో వెంటనే దానిని వీడియో తీసి రెస్టారెంట్‌కు చూపించాడు. అయితే వాళ్లు ఒక్క సారీ చెప్పి ఊరుకున్నారట. కానీ అరుణ్ మాత్రం వదల్లేదు. వేరే కస్టమర్లకు ఇలాంటి అనుభవాలు జరగకూడదని డిస్ట్రిక్ ఫోరంకు తీసుకెళ్లాడు. తినే తిండిలో బొద్దింక రావడం చూసి కొన్ని రోజుల పాటు ఆకలి వేయలేదని, వాంతులు అవుతూనే ఉన్నాయని తన బాధ చెప్పుకున్నాడు. అయితే రెస్టారెంట్ ఓనర్లు మాత్రం అరుణ్ చెప్పేది అబద్ధం అని వండిన తర్వాత కూడా బొద్దింక ఎలా బతికే ఉంటుందని వింతగా వాదించారు. దాంతో కోర్టు రెస్టారెంట్‌దే తప్పని తీర్పు ఇస్తూ అరుణ్‌కి పరిహారం కింద 20,000, కోర్టు హియరింగ్‌కి వచ్చినందుకు అయిన ఖర్చుగా రూ.10000 చెల్లించాలని చెప్పింది. అది కూడా 40 రోజుల్లో పరిహారం చెల్లించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.