రాహుల్ కుట్టిన చెప్పు.. ల‌క్ష‌లు ఇచ్చినా ఇవ్వ‌నంటున్న చెప్పులు కుట్టేవాడు

cobbler offered 10 lakhs for rahul stiched slipper but he rejected

Rahul Gandhi: ఓ పేద వాడికి ఒక ల‌క్ష రూపాయ‌లు ఇస్తానంటే ఎంతో ఆనంద‌ప‌డ‌తాడు. దానితో త‌న జీవితాన్ని మార్చుకోవాల‌ని అనుకుంటాడు. కానీ పై ఫోటోలో రాహుల్ గాంధీ ప‌క్క‌న‌ క‌నిపిస్తున్న పెద్దాయ‌న మాత్రం డ‌బ్బు కంటే త‌న‌కు వ‌స్తువు, మ‌నిషే ముఖ్యం అనుకున్నాడు.

ఆ పెద్దాయ‌న పేరు రామ్‌. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో చెప్పులు కుట్టుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. నెల‌కు రూ.5000 వ‌ర‌కు సంపాదిస్తుంటాడు. ఓ కేసు విష‌యంలో కోర్టుకు హాజ‌ర‌య్యేందుకు రాహుల్ గాంధీ సుల్తాన్‌పూర్‌లోని కోర్టుకు వెళ్లాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో రామ్‌ని చూసి ఎందుకో రాహుల్ ఆగారు. అత‌నితో కాసేపు మాట్లాడి ఓ జ‌త చెప్పుల్ని కుట్టారు కూడా. దాంతో రామ్ స్థానికంగా చాలా ఫేమ‌స్ అయిపోయారు. రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులు మాకు కావాలంటే మాకు కావాలంటూ చాలా మంది ఎగ‌బ‌డ్డారు.

ఒక వ్య‌క్తి అయితే రూ.10 ల‌క్ష‌లు ఇస్తాన‌ని అన్నాడు. అయినా కూడా రామ్ ఒప్పుకోలేదు. త‌న‌కు రాహుల్ గాంధీ కుట్టించ‌న చెప్పులు ల‌క్కీ అని వాటిని భ‌ద్రంగా దాచుకుంటానే త‌ప్ప ఎవ్వ‌రికీ ఇవ్వ‌నని అంటున్నారు.