CJI: లాయ‌ర్ల‌కు ఉన్న ల‌గ్జ‌రీ మాకెక్క‌డిది?

cji says we do not have a luxury that lawyers have

CJI: న్యాయ‌వాదుల‌కు ఉండే లగ్జ‌రీ న్యాయ‌మూర్తుల‌కు ఉండ‌ద‌ని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ చంద్ర‌చూడ్. ఎలాంటి కేసులు వాదించాలో ఎంచుకునే హ‌క్కు లాయ‌ర్ల‌కు ఉంటుంది కానీ.. ఏ కేసుని వినాలో ఎంపిక‌చేసుకునే హ‌క్కు త‌మ‌కు లేద‌ని.. వ‌చ్చే ప్ర‌తీ కేసు వినాల్సిందే అని అన్నారు.

“” నాకు క‌మ‌ర్షియ‌ల్ కేసులు విన‌డం వాదోప‌వాదాలు విన్నాక తీర్పు ఇవ్వడంలో అనుభ‌వం లేదు. కానీ ఆ కేసులు కూడా నేను వినాల్సిందే. కొన్ని సార్లు అస‌లు ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వ‌డానికి కూడా కుద‌ర‌దు. అయినా స‌రే.. వినాల్సిందే.. తీర్పు చెప్పాల్సిందే. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు తీసుకున్నాక తొలి రోజుల్లో ఎంతో కంగారు ప‌డిపోయేవాడిని. నా ఉద్దేశంలో బాంబే హైకోర్టుకి ఉన్న స్వాతంత్ర్యం ఎవ్వ‌రికీ లేదు. ఆ కోర్టు జ‌డ్జిల‌కు ధైర్యం ఎక్కువ‌. కానీ లాయ‌ర్ల‌కు ఉండే ల‌గ్జ‌రీ మాత్రం మాకు ఉండ‌దు. మేం అన్ని కేసులు వినాలి. తీర్పు చెప్పాలి “” అన్నారు.