CIBIL Score: సిబిల్ స్కోర్‌పై RBI కొత్త రూల్స్ ఏంటి?

CIBIL Score rules by rbi

CIBIL Score:  రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిల్ స్కోర్‌కు సంబంధించి 6 కొత్త నిబంధ‌న‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. ఈ నిబంధ‌న‌లు 2025 జ‌న‌వ‌రి 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. ఇంత‌కీ ఏంటా నిబంధ‌న‌లు?

2025 జ‌న‌వ‌రి 1 నుంచి సిబిల్ స్కోర్ ప్ర‌తి 15 రోజుల‌కోసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్ర‌స్తుతానికి నెల‌కోసారి అప్డేట్ అవుతోంది.

ఏ బ్యాంక్ అయినా, ఫైనాన్షియ‌ల్ కంపెనీ అయినా మీ సిబిల్ స్కోర్ చెక్ చేసిన ప్ర‌తీసారి మీకు మెసేజ్ లేదా మెయిల్ ద్వారా నోటిఫికేష‌న్ వ‌స్తుంది. దీని ద్వారా మీ క్రెడిట్ రిపోర్ట్ ఎవ‌రెవ‌రు చూస్తున్నారు అనే విష‌యం మీకు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుస్తూ ఉంటుంది.

మీరు లోన్ రిక్వెస్ట్ కానీ క్రెడిట్ కార్డు రిక్వెస్ట్ కానీ రిజెక్ట్ అయితే.. ఎందుకు రిజెక్ట్ అయ్యిందో మీకు లెండ‌ర్ కార‌ణం చెప్పి తీరాల్సిందే.

మీరు తీసుకున్న క్రెడిట్ కార్డు పూర్తి రిపోర్ట్‌ను ప్ర‌తి ఏడాదికి ఓసారి స‌ద‌రు క్రెడిట్ కార్డు కంపెనీ మీకు మెయిల్ పంపుతుంది. దీని ద్వారా ఎటువంటి ఛార్జీలు లేకుండా మీ సిబిల్ స్కోర్ ఎలా సాగుతోందో తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది.

మీరు క్రెడిట్ కార్డు లేదా లోన్‌కి సంబంధించిన పేమెంట్ ఒక నెల క‌ట్ట‌క‌పోతే.. స‌దరు కంపెనీ రిపోర్ట్ చేసే ముందు మీకు స‌మాచారం అందించాల్సిందే. మీకు స‌మాచారం అందించ‌కుండా మీరు ఈఎంఐ క‌ట్ట‌లేదు అని కంప్లైంట్ ఇస్తే అది కంపెనీకే లాస్.

మీ క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఏవ‌న్నా ఫిర్యాదులు ఉంటే వాటిని 30 రోజుల్లో రిజాల్వ్ చేసేయాల్సిందే. 30 రోజులు దాటాక కూడా కంపెనీ మీ ఫిర్యాదును ప‌రిష్క‌రించ‌క‌పోతే రోజుకు రూ.100 మీకు కంపెనీ చెల్లించాలి.