104 రోజులు నిరంతర పని.. చనిపోయిన ఉద్యోగి
China: ఓ వ్యక్తి 104 రోజుల పాటు పని చేస్తూనే ఉండటంతో అవయవాలు ఫెయిలై చనిపోయిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని గ్వాంగ్‌చూ అనే ప్రాంతానికి చెందిన అబౌ అనే 30 ఏళ్ల వ్యక్తి ఓ కంపెనీలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను నిన్న చనిపోయాడు. కంపెనీలో అసలు సెలవు, వీకాఫ్ అనేదే లేకుండా 104 రోజుల పాటు నిరంతరం పనిచేస్తుండడంతో అతనికి న్యూమోకాకల్ ఇన్‌ఫెక్షన్ సోకింది.
ఈ ఇన్‌ఫెక్షన్ సోకితే రోగనిరోధక శక్తి తగ్గిపోయి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దాంతో అబౌ నిన్న చనిపోయాడు. అబౌ మృతికి కంపెనీ 20 శాతం కారణం అంటూ అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అబౌ మృతి పట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. దీనిపై ఆ కంపెనీ యాజమాన్యం స్పందిస్తూ.. అబౌకి ముందు నుంచీ అనారోగ్య సమస్యలు ఉన్నాయని అతను సమయానికి వైద్యలను సంప్రదించకపోవడం వల్లే ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని ఆరోపిస్తోంది.
కోర్టులో వాదోపవాదాల తర్వాత కంపెనీ లేబర్ నిబంధనలను ఉల్లఘించి అత్యధిక రోజులు విరామం లేకుండా పని చేయించుకుందని అబౌ అధిక పని వల్ల చనిపోకపోయినప్పటికీ కంపెనీ ఉల్లంఘనలకు పాల్పడినందుకు గానూ 50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.