China: అణుశక్తి అభివృద్ధిలో అమెరికాను దాటేసిన చైనా..చంక‌లు గుద్దుకుంటున్న డ్రాగ‌న్

China is ahead of the US by up to 15 years in developing high tech nuclear power

 

China: హైటెక్ క్షిప‌ణి అభివృద్ధిలో చైనా అమెరికా కంటే 15 ఏళ్లు ముందుంది. ఒక్కో న్యూక్లియ‌ర్ రియాక్ట‌ర్‌ను నిర్మించేందుకు చైనా ఏడేళ్లు తీసుకుంటోంది. అలా ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 27 న్యూక్లియ‌ర్ రియాక్ట‌ర్ల‌ను రెడీ చేసి పెట్టుకుంది. ఏడేళ్ల‌లో ఒక న్యూక్లియ‌ర్ రియాక్ట‌ర్ అనేది ఇప్ప‌టివ‌ర‌కు ఏ దేశానికి కూడా సాధ్యం కాలేదు. వేగంగా ఆధునిక న్యూక్లియ‌ర్ రియాక్ట‌ర్ల నిర్మాణాల్లో భాగంగా చైనా వాటి నిర్మాణ ఖర్చు త‌గ్గించుకుంది. అంతే కాదు కాలక్రమేణా ఆ రియాక్ట‌ర్ల‌కు మెరుగులు దిద్దేందుకు కూడా చైనాకు అవ‌కాశం ఉంటుంది. దీని ద్వారా చైనా కంపెనీల నుంచి కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు పుట్టుకొచ్చే అవ‌కాశం మ‌రింత పెరుగుతుంది.

అమెరికాలో ఓ హైటెక్ న్యూక్లియ‌ర్ ప్లాంట్‌ను నిర్మించేందుకు స‌న్నాహాలు జ‌రిగాయి కానీ గ‌తేడాది అది క్యాన్సిల్ అయ్యింది. చైనా ఈ రేంజ్‌లో హైటెక్ న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ప్లాంట్స్‌ను నిర్మించుకుంటూ పోతోందంటే అందుకు కార‌ణం చైనాకు చెందిన బ్యాంకులే. సొంత దేశానికి చెందిన బ్యాంకులే కాబ‌ట్టి న్యూక్లియ‌ర్ రియాక్ట‌ర్ల నిర్మాణం కోసం త‌క్కువ వ‌డ్డీ కే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయ‌ట‌. ఇందుకోసం త‌క్కువ వ‌డ్డీల‌కే చైనా బ్యాంకులు ఇస్తున్న లోన్లు మ‌రే దేశంలోనూ ఇవ్వ‌డంలేదు.

స్వ‌దేశీ వ‌స్తువుల‌తోనే చైనా ఇటీవ‌ల హై టెంప‌రేచ‌ర్ గ్యాస్ కూల్డ్ రియాక్ట‌ర్‌ను నిర్మించింది. ఇది ప్ర‌పంచంలోనే నాలుగో జ‌న‌రేష‌న్‌కు చెందిన అతిపెద్ద రియాక్ట‌ర్. అయితే.. ఈ రియాక్ట‌ర్ల నిర్మాణ విష‌యంలో చైనా ఎంత ముందున్న‌ప్ప‌టికీ అణు భాగాల అధిక సరఫరా, అధిక పోటీ వల్ల ధరలు తగ్గిపోవడం నష్టాలు ఏర్పడటం వంటి సమస్యలు మాత్రం చైనా ఎదుర్కొంటూనే ఉంది.

అమెరికా న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కోసం జాతీయ వ్యూహాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. పరిశోధన అభివృద్ధి విష‌యాల్లో మరింత మదుపు చేయాలి. ప్రోత్సాహకరమైన సాంకేతికతలను వేగవంతం చేయాల్సి ఉంది. సరైన పెట్టుబ‌డులు ప్ర‌ణాళిక‌లు ఉంటే న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ అభివృద్ధి విష‌యంలో చైనాను దాటేయ‌డం అమెరికాకు చిటికెలో ప‌ని.