అందమైన గవర్నర్.. 58 మందితో ఎఫైర్లు
China: పై ఫోటోలో ఉన్న మహిళను చూసారా? ఈమె చైనాలోనే అత్యంత అందమైన గవర్నర్ అట. తన అందాన్ని అడ్డుపెట్టుకుని ఈవిడ చెయ్యని వెధవ పని అంటూ లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి చెందిన చాంగ్ యాంగ్ అనే మహిళ గీచూ ప్రావిన్స్‌కి గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. చాంగ్ 22 ఏళ్ల వయసులోనే కమ్యూనిస్ట్ పార్టీలో చేరింది. ఇప్పుడు చాంగ్ వయసు 52. రైతుల కోసం పండ్ల సాగు కార్యక్రమాలను నిర్వహిస్తూ.. వృద్ధుల కోసం దానాలు చేస్తూ చాంగ్ ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ మంచి ముసుగు వెనక ఓ లంచగొండి ఉందని ఇటీవల బయటపడింది. తన పదవిని అడ్డుకుని తన దగ్గర పనిచేసే దాదాపు 58 మంది అధికారులతో ఎఫైర్లు పెట్టుకుంది. అంతేకాదు.. తన పదవీ కాలంలో దాదాపు 60 మిలియన్ యువాన్లు అంటే దాదాపు 70 కోట్ల రూపాయలను లంచాల రూపంలో తినేసింది.
గతేడాది జనవరిలో చాంగ్‌కి సంబంధించిన ఓ డాక్యుమెంటరీ రిలీజ్ అవడంతో ఈమె బాగోతాలు బయటపడ్డాయి. ఏప్రిల్‌లో చాంగ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. డాక్యుమెంటరీలో చూపించినవన్నీ నిజాలే అని తేలాయి. ప్రభుత్వ తరఫు పెట్టుబడుల పేర్లతో ఎన్నో కంపెనీలకు ఫండ్స్ కల్పించింది. ఎందరికో కాంట్రాక్టులు ఇప్పించింది. ఆమె కింద పనిచేసే కొందరు ఆమె అందానికి ఫిదా అయ్యి ఎఫైర్లు పెట్టుకోగా.. మరికొందరు భయంతో ఆమె చెప్పినట్లు నడుచుకోవాల్సి వచ్చింది. నేర అభియోగాలన్నీ నిజాలు అని కోర్టు తేల్చడంతో ఆమెకు 13 ఏళ్ల జైలు శిక్ష 1.5 కోట్ల రూపాయల జరిమానాను విధించింది.