Hardeep Singh Nijjar: షాకింగ్.. నిజ్జ‌ర్ హ‌త్య వెనుక చైనా…!

కెన‌డాలో హ‌త్య‌కు గురైన ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ (hardeep singh nijjar) గురించి షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. నిజ్జ‌ర్ హ‌త్య వెనుక చైనా క‌మ్యూనిస్ట్ పార్టీ (china communist party) హ‌స్తం ఉంద‌ని చైనాకు చెందిన బ్లాగ‌ర్ జెన్నిఫ‌ర్ జెంగ్ (jennifer jeng) వెల్ల‌డించింది. నిజ్జ‌ర్ హ‌త్య వెనుక భార‌త్ ఉందని ఇత‌ర దేశాల‌ను న‌మ్మించి ఇండియాకు వెస్ట్ దేశాల మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టాల‌ని చైనా కుట్ర‌పన్నింద‌ని జెన్నిఫ‌ర్ పేర్కొంది. జెన్నిఫర్‌కు ఈ విష‌యం లావో డెంగ్ అనే యూట్యూబ‌ర్ నుంచి తెలిసింది. ప్ర‌స్తుతం లావో డెంగ్ కెన‌డాలో ఉంటున్నాడు.

జెన్నిఫ‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. చైనా క‌మ్యూనిస్ట్ పార్టీకి చెందిన అధికారిని ఈ ఏడాది జూన్‌లో అమెరికాకు పంపింది. అక్క‌డి నుంచి చైనా నిజ్జ‌ర్‌ను చంపేందుకు ప్లాన్ వేసింది. నిజ్జ‌ర్‌ను చంపేందుకు చైనా ఏజెంట్లు సైలెంట్ గ‌న్నులు వాడార‌ని.. అత‌ను చ‌నిపోయాడ‌ని నిర్ధారించుకున్నాక డ్యాష్ కెమెరాతో స‌హా అన్ని ఆధారాల‌ను నాశ‌నం చేసార‌ని తెలిపింది. నిజ్జ‌ర్ హ‌త్య వెనుక భార‌త్ ఉంద‌ని న‌మ్మించేందుకు ఇండియ‌న్ యాస‌లో ఇంగ్లీష్ మాట్లాడార‌ని షాకింగ్ వివ‌రాలు వెల్ల‌డించింది. ఈ ప్లాన్‌ను వేయ‌డానికి ముందు చైనా క‌మ్యూనిస్ట్ పార్టీ రెండు ముఖ్య‌మైన మీటంగ్స్ పెట్టుకుంద‌ని తెలిపింది. (hardeep singh nijjar)

జెన్నిఫ‌ర్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై అటు చైనా కానీ కెన‌డా కానీ భార‌త్ కానీ ఇంకా అధికారికంగా స్పందించ‌లేదు. మ‌రోప‌క్క కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో నిజ్జ‌ర్ హ‌త్య వెనుక భార‌త్ హ‌స్తం ఉంద‌ని నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. వాటిలో నిజం లేద‌ని భార‌త్ మొత్తుకుంటున్నా కూడా ఆయ‌న వెన‌క్కి త‌గ్గ‌డంలేదు. అలాగ‌ని ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఆధారాలు కూడా చూపించింది లేదు. మ‌రోప‌క్క ఈ ఆరోప‌ణ‌లు ఎంతో సీరియ‌స్ అని.. భార‌త్ అన్ని విధాలుగా కెన‌డా చేప‌ట్టే విచార‌ణ‌కు స‌హ‌కరించాల‌ని అగ్ర‌రాజ్యం అమెరికా అంటోంది.