Supreme Court: అలా క‌న్న పిల్ల‌ల‌కూ ఆస్తిలో వాటా

చెల్లుబాటు కాని వైవాహిక జీవితంలో భార్యాభ‌ర్త‌ల‌కు క‌లిగిన పిల్ల‌ల‌కు ఆస్తిలో వాటా ఉంటుంద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం (supreme court) తీర్పునిచ్చింది. మ‌న భార‌తదేశ చ‌ట్టం ప్ర‌కారం..మొద‌టి భార్య లేదా మొద‌టి భ‌ర్తతో విడాకులు తీసుకోకుండా వేరొక‌రిని పెళ్లి చేసుకుంటే ఆ వివాహం చెల్లుబాటు కాదు. ఒక‌వేళ అప్ప‌టికే రెండో వివాహం ద్వారా పిల్ల‌లు పుడితే.. వారికి ఆస్తిలో కొంత వాటా ఇవ్వాల్సిందేన‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టంచేసింది.

2011 కేసు విచార‌ణ‌లో భాగంగా భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. మ‌రో ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల‌తో క‌లిసి చ‌ర్చించిన త‌ర్వాత వెల్ల‌డించిన తీర్పు ఇది. కాక‌పోతే కొన్ని కండీష‌న్లు కూడా విధించింది. చెల్లుబాటు కాని వివాహం ద్వారా పుట్టిన పిల్ల‌ల‌కు త‌మ త‌ల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల్లో వాటా ఉంటుంది కానీ వంశ‌పార‌ప‌ర్యంగా ఉన్న ఆస్తిలో వాటా రాదు అని గ‌తంలో  ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్ల‌డించింది. కాక‌పోతే అలా పుట్టిన పిల్ల‌లు హిందూ వారసత్వ చట్టం ప్రకారం మాత్రమే హక్కులు పొందవచ్చని కోర్టు పేర్కొంది.
(supreme court)