కూతురి స్నేహితులను వ్యభిచారంలోకి నెట్టిన తల్లి
ఓ మహిళ తన కూతురి స్నేహితులను వ్యభిచారంలోకి దింపిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో స్కూల్ పిల్లల ద్వారా వ్యభిచారం నడుపుతున్నారని చెన్నై ఏసీపీకి సమాచారం రావడంతో వారు పకడ్బందీగా రెయిడ్లు నిర్వహించారు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. నదియా అనే మహిళ తన కూతురి క్లాస్‌మేట్స్ ఇంటికి రావడంతో వారి ద్వారా వ్యభిచార గృహాన్ని నడుపుతోంది. విషయం ఎవరికీ తెలీకూడదని వారికి డబ్బులు ఇచ్చి నోరుమూయించింది. తన కూతురి కోసం ఇంటికి వచ్చే అమ్మాయిల్లో పేద, మధ్య తరగతి అమ్మాయిలను టార్గెట్ చేసినట్లు విచారణలో తేలింది. పట్టుబడిన అమ్మాయిల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.