Chat GPT: 17 మంది డాక్టర్ల వల్ల కానిది.. చాట్ GPT సాల్వ్ చేసింది
చాట్ జీపీటీ (chat gpt), ఆర్టిఫిషియల్ ఇన్‌టెలిజెన్స్ వల్ల ఎందరో ఉద్యోగాలకు ముప్పు ఉంది అన్నారు. కానీ డాక్టర్లు చేసేది ఆర్టిఫిషియల్ ఇన్‌టెలిజెన్స్ ఎప్పటికీ చేయలేదు అని కూడా వాదించారు. కానీ ఈ కేసులో డాక్టర్లు ఓడిపోయారు.. చాట్ జీపీటీ గెలిచింది.
కోర్ట్నీ అనే మహిళ.. తన నాలుగేళ్ల అలెక్స్ అనే కుమారుడు ఎంతో కాలంగా పళ్ల నొప్పితో బాధపడుతుంటే ఎందరో డాక్టర్లకు చూపించింది. ఆమె ఇప్పటివరకు ఏకంగా 17 మంది డాక్టర్లకు అలెక్స్‌ను చూపించింది. వారెవ్వరికీ అలెక్స్ ఏ వ్యాధితో బాధపడుతున్నాడో అర్థమయ్యేది కాదు.దాంతో అసలు అలెక్స్‌కి ఉన్న వ్యాధి ఏంటో తెలుసుకునేందుకు చాట్ జీపీటీలో అతనికి ఉన్న లక్షణాలన్నీ టైప్ చేసి చూసింది. అప్పుడు చాట్ జీపీటీ ఆ లక్షణాలను బట్టి అలెక్స్‌కు టెదర్డ్ కార్డ్ సిండ్రోమ్ ఉన్నట్లు చెప్పింది. ఈ సమస్యకు న్యూరాలజిస్ట్‌ని కలవాలని కూడా సూచించింది. వెంటనే కోర్ట్నీ అలెక్స్‌ను తీసుకుని దగ్గరున్న స్కానింగ్ రిపోర్ట్‌లతో ఓ న్యూరాలజిస్ట్ వద్దకు వెళ్లింది. (chat gpt)
ఆ డాక్టర్ అన్నీ పరిశీలించాక.. చాట్ జీపీటీ చెప్పింది నిజమే అని తేల్చాడు. టెదర్డ్ కార్డ్ సిండ్రోమ్ అంటే పిల్లలు సరిగ్గా కూర్చోలేకపోవడం.. ఎప్పుడూ ఏదో ఒక నొప్పితో బాధపడుతుండడం లాంటివి ఉంటాయి. ఇక అలెక్స్ వ్యాధి ఏంటో తెలిసింది కాబట్టి డాక్టర్ ఆ వ్యాధికి తగ్గట్టుగా మెడిసిన్స్ రాసిచ్చారు. ప్రస్తుతం అలెక్స్ ఆరోగ్యం బాగానే ఉందని కోర్ట్నీ తెలిపింది. ఇలా ఒక డాక్టర్ కనుక్కోలేనిది చాట్ జీపీటీ కనుక్కోవడం ఇది మొదటిసారేం కాదు. గతంలో ఓ మహిళ తన పెంపుడు కుక్కకు వచ్చిన వ్యాధిని ఏ వైద్యులూ కనుక్కోలేకపోయారని చాట్ జీపీటీ కనుక్కోగలిగిందని ట్విటర్ ద్వారా వెల్లడించడం వైరల్‌గా మారింది.